శ్రీకాళహస్తీశ్వర శతకము!..........23/4/15

శ్రీకాళహస్తీశ్వర శతకము!..........23/4/15

.

నిన్నే రూపముగా భజింతు మదిలో / నీ రూపుమోకాలో స్త్రీ

చన్నో కుంచమో,మేకపెంటియొ యీ / సందేహముల్మాన్పి నా

కన్నార న్భవదీయమూర్తి సగుణా / కారంబుగా జూపవే

చిన్నీరేజ విహార మత్తమధుపా / శ్రీకాళహస్తీశ్వరా!

.

శ్రీ కాళాహస్తీశ్వరా!నీ భక్తులు కోరిన రీతిన సేవించిన చోటనే ప్రత్యక్షమగుచూ వారికి వరాల నిచ్చుచున్నాను.

1.శ్రీకృష్ణుని ఆనతి మేరకు అర్జునుడు కృష్ణుని మోకాలి చిప్పమీద శివుని పూజింపగా,అర్జునునకు ప్రత్యక్షమై పాశుపతాస్త్రమిచ్చెను.అట్టి నిన్ను మనస్సులో ఏ రూపములో ద్యానము చేయగలను.నీవు ఒకసారి మోకాలిచిప్పరూపులోను,స్త్రీ యొక్క స్థనములోను,ద్యానము కొల్చే కుంచము రూపములోను,మేక పెంటిక రూపములోనునీ భక్తులకు దర్శనమిచ్చితివి.నీది అసలు ఏ రూపము.నా ఈ అనుమానము తీర్చి కనులారా నీ రూపమును దర్శించనిమ్ము.

.

2.ఒక భక్తుడు స్త్రీలోలుడై శివరాత్రినాడు సంగమము జరుపుచున్న స్త్రీస్తనము మీద శివరూపమును ద్యానించగా శివుడు ప్రత్యక్షమై వానికి కైవల్యమిచ్చెను.అందుకే ఆయన ఆచంటేశ్వరుడు.

.

3.ఒక వర్తకుడు దాన్యము కొలుచ్చుండగా దాన్యకుంచము మీద శివుని ద్యానించగా అచట ప్రత్యక్షమై వానికి మోక్షమిచ్చెను.ఆకారణం చేతనే ఆయన కుంచేశ్వరుడు.

.

4.ఒక గొల్లడు మేక పెంటికలేరుచు అచ్చట శివనామము ద్యానించగా పెంటికమీద శివుడు ప్రత్యక్షమై కైవల్య ప్రాప్తినిచ్చెను.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!