శ్రీకాళహస్తీశ్వర శతకము...(ధూర్జటి.).... 26/4/15.

శ్రీకాళహస్తీశ్వర శతకము...(ధూర్జటి.).... 26/4/15.

.

 


 .
నీకున్, మాంసము వాంఛయేని కరవా? నీ చేత లేడుండగా
.
జోకైనట్టిగా కుఠారముండ, ననలజ్యోతుండ, నీరుండగా...
.
పాకరంబొప్ప ఘటించి, చేతిపునుకన్ భక్షింప కా బోయచేఁ
.
చేకొం టెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వరా!
.
.
ఈశ్వరా! నీకు మాంసాహారముపై కోరిక కలిగినచో, నీ చేతిలో లేడి ఉంది.
.
గండ్రగొడ్డలి ఉన్నది. నీ మూడవకంటిలో నిప్పున్నది. తలమీద నీరున్నది.
.
కొంచెము శ్రమపడి వంట చేసుకుని శుచిగా రుచిగా తినలేకపోయావా?
.
ఆ తిన్నడు ఎంగిలి చేసి పెట్టిన మాంసమే కావలసి వచ్చినదా?
.
నీవంటి వాడు ఇట్లు చేయవచ్చునా?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!