సౌందర్యాన్ని ఆరాధించడం వేరు ఆకాంక్షించడం వేరు.

సౌందర్యాన్ని ఆరాధించడం వేరు ఆకాంక్షించడం వేరు. 

సౌందర్యాన్ని గుర్తించి, దానికి శిరసువంచి నమస్కరించి, 

ఆనందించగల సంస్కారం అలవరచుకుంటే తప్ప వచ్చేది కాదు

. అదే రసికత. రసికత అంటే Sensual Pleasure కాదు.

దురదృష్టవశాత్తూ దానికి ఆ అర్థం రూఢి అయిపోయింది .

.

సౌందర్యం మనలో ప్రేమ కలిగించడమేమిటి? అని అనుకోవచ్చు.

సౌందర్యం అన్నివేళలా మదనవికారాన్నే కలిగించనక్కరలేదు.

ఒక ఆశ్చర్యం, ఒక విభ్రమం, ఒక ప్రశాంతత, ఒక అనిర్వచనీయమైన వాక్యసముదాయం ఏదైనా కలిగించవచ్చు.

కేవలం ఊహే అయినప్పటికీ, బహుశా అటువంటి స్థితికి లోనయ్యేడేమో కాళిదాసు (సినిమాలో చూపించినట్టు) “మాణిక్య వీణాం…”

అన్న శ్లోకం చదివే సందర్భంలో

.

మాణిక్య వీణా ముఫలాలయంతీం

మదాలసాం మంజుల వాగ్విలాసాం

మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం

మాతంగకన్యాం మనసా స్మరామి

చతుర్భుజే చంద్రకళావతంసే

కుచోన్నతే కుంకుమరాగశోణే

పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే

నమస్తే! జగదేకమాతః జగదేకమాతః ...ఆ...

మాతా...! మరకతశ్యామా! మాతంగీ మధుశాలినీ!

కుర్యాత్కటాక్షం కల్యాణీ! కదంబ వనవాసినీ...!

జయ మాతంగతనయే...! 

జయ నీలోత్పలద్యుతే! 

జయ సంగీతరసికే! 

జయ లీలాశుకప్రియే...!

జై జననీ!

సుధాసముద్రాంత ఋద్యన్మణిద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్య 

కల్పద్రుమాకల్ప కాదంబ కాంతారవాసప్రియే...!

కృత్తివాసప్రియే...!

సాదరారబ్ధ సంగీతసంభావనా సంభ్రమాలోల నీప స్రగాబద్ధ 

చూళీ సనాథత్రికే! సానుమత్పుత్రికే...! 

శేఖరీభూతశీతాంశురేఖా మయూఖావళీబద్ధసుస్నిగ్ధ నీలాలకశ్రేణి 

శృంగారితే! లోకసంభావితే...!

కామలీలా ధనుస్సన్నిభభ్రూలతా పుష్ప సందేహ కృచ్ఛారు గోరోచనా 

పంకకేళీ - లలామాభిరామే...! సురామే! రమే...!

సర్వయంత్రాత్మికే! సర్వతంత్రాత్మికే! 

సర్వమంత్రాత్మికే! సర్వముద్రాత్మికే! 

సర్వశక్త్యాత్మికే! సర్వచక్రాత్మికే! 

సర్వవర్ణాత్మికే! సర్వరూపే! 

జగన్మాతృకే! హే జగన్మాతృకే! 

పాహి మాం పాహి మాం, పాహి పాహి!


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!