శ్రీకాళహస్తీశ్వర శతకము.! ..(ధూర్జటి.)..29/4/15.

శ్రీకాళహస్తీశ్వర శతకము.! ..(ధూర్జటి.)..29/4/15.

.

రాజార్థాతురుడైనచో నెచట ధ ర్మంబుండు? నే రీతి నా

నాజాతి క్రియలేర్పడున్?సుఖము మా న్య శ్రేణికెట్లబ్బు? రూ

పాజీవాళికి నేది దిక్కు? దృతి నీ భక్తుల్ భవత్పాద నీ

రేజంబుల్ భజయింతు రే తెరగునన్! / శ్రీ కాళహస్తీశ్వరా!.

.

శ్రీ కాళహస్తీశ్వరా!పాలకుడు దనమునందు కోరికగల వాడైనచో దర్మమెచ్చటనుండును?వర్ణాశ్రమ దర్మములు ఏ విధముగా నిర్ణయింపబడును?

గౌరవ మర్యాదలతో జీవించువానికి కే విదముగా సౌఖ్యము లబ్బును?

వేశ్యలకు రక్షణ ఏది?

అందువలన నీ భక్తులు దైర్యముతో నీ పాదపద్మములను

సేవించుకోగలిగిన మార్గము ఏది?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!