మను చరిత్రము.!.....(అల్లసాని పెద్దన్న.) 27/4/15.

మను చరిత్రము.!.....(అల్లసాని పెద్దన్న.) 27/4/15.

(ప్రవరుని సౌందర్యముఁగని వరూధిని మోహించుట..

.

.తెరువుఁ దెల్పుమని ప్రవరుఁడు వరూధిని నర్థించుట.)

.

ఉ. అబ్బురపాటుతోడ నయనాంబుజముల్‌ వికసింపఁ, గాంతి పె

ల్లుబ్బి కనీనికల్‌ వికసితోత్పలపంక్తులఁ గ్రుమ్మరింపఁగా,

గుబ్బ మెఱుంగుఁ జన్గవ గగుర్పొడువన్‌, మదిలోనఁ గోరికల్‌

గుబ్బతిలంగఁ జూచె, నలకూబరసన్నిభు నద్ధరామరున్‌.

.

ఉ. చూచి, ఝళంఝళ త్కటక సూచిత వేగ పదారవిందయై

లేచి, కుచంబులు\న్‌ దుఱుము లేనడుమల్లల నాడ, నయ్యెడన్‌

బూచిన యొక్క పోఁక నునుబోదియఁ జేరి విలోకనప్రభా

వీచికలన్‌ఁ, దదీయ పదవీకలశాంబుధి వెల్లిగొల్పుచున్‌.

.

క. పంకజముఖి కప్పుడు మై

నంకురితము లయ్యెఁ బులక లావిష్కృత మీ

నాంకానల సూచక ధూ

మాంకురములు వోలె మఱియు నతనిన్‌ జూడన్‌. 

.

ఉ. ఎక్కడివాఁడొ! యక్షుతనయేందు జయంత వసంత కంతులన్‌

జక్కఁదనంబునన్‌ గెలువఁ జాలెడు వాఁడు, మహీసురాన్వయం

బెక్కడ? యీతనూవిభవమెక్కడ? యేలని బంటుగా మరున్‌

డక్కఁగొనంగరాదె యకటా! నను వీఁడు పరిగ్రహించినన్‌.

.

మ. అని చింతించుచు మీనకేతనధనుర్జ్యాముక్త నారాచ దు

ర్దిన సమ్మూర్ఛిత మానసాంబురుహయై, దీపించు పెందత్తఱం

బునఁ బేటెత్తిన లజ్జ నంఘ్రికటకంబుల్‌ మ్రోయ, నడ్డంబు ని

ల్చిన నయ్యచ్చరఁ జూచి చేరఁ జని పల్కె\న్‌ వాఁడు విభ్రాంతుఁడై.

.

ఉ. ఎవ్వతె వీవు భీతహరిణేక్షణ! యొంటిఁ జరించె దోట లే

కివ్వనభూమి? భూసురుఁడ, నేఁ బ్రవరాఖ్యుఁడఁ, ద్రోవ తప్పితి\న్‌

గ్రొవ్వున నిన్నగాగ్రమునకు\న్‌ జనుదెంచి, పురంబుఁ జేర నిం

కెవ్విధిఁ గాంతుఁ? దెల్పఁగదవే! తెరు వెద్ది? శుభంబు నీ కగు\న్‌. 

.

క. అని తనకథ నెఱిఁగించినఁ

దన కనుఁగవ మెఱుఁగు లుబ్బఁ, దాటంకములు\న్‌

జనుఁగవయ నడుమ వడఁకఁగ,

వనిత సెలవివాఱ నవ్వి వానికి ననియెన్‌.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!