అల వైకుంఠపురంబులో..

అల వైకుంఠపురంబులో..

.

భాగవత రచనలో ముఖ్యంగా ఈ పద్యానికి ఒక ప్రత్యేకత ఉంది .

.

గజేంద్రుడు పిలిచినప్పుడు వైకుంటం లో ఉన్న విష్ణుమూర్తి ని వర్ణించాలి .. 

.

అసలు వైకుంటం లో విష్ణుమూర్తి ఎలా ఉండి ఉంటాడు . అక్కడ ఏమి ఉంటాయ్ .

.

ఎలా వర్ణించాలి అని పోతన గారు ఎంతగా ఆలోచిస్తున్న తనకి ఏమి తట్టడం లేదంటా 

.

పోతన గారు వాళ్ళ అమ్మాయ్ తో నేను గుడివరకు వెళ్ళిస్తాను అని చెప్పారంట.. 

.

ఆయన వచ్చేలోపే సాక్షాత్తు వైకుంటా వాసే వచ్చి పద్యాన్ని పూర్తీ చేసి వెళ్ళాడు .

.

అదే ఈ పద్యం చూడండి 

.

అల వైకుంఠపురంబులో నగరిలో నా మూల సౌధంబు దా

.

పల మందారవనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో 

.

త్పల పర్యంక రమావినోది యగు నాపన్న ప్రసన్నుండు వి 

.

హ్వల నాగేంద్రము "పాహిపాహి" యనఁ గుయ్యాలించి సంరంభియై.

.

.

(అల = అక్కడ; వైకుంఠపురంబులో - వైకుంఠ = వైకుంఠమనెడి; పురంబు = పట్టణము; లోన్ = అందు; నగరిలోనా - నగరి = రాజభవనసముదాయము; లోన్ = అందు; ఆ = ఆ; మూల = ప్రధాన; సౌధంబు = మేడ {సౌధము - సుధ (సున్నముతో) చేయబడినది, మేడ}; దాపల = దగ్గర; మందారవనాంతరామృతసరః - మందార = మందారపూల; వన = తోట; అంతర = లోపల; అమృత = అమృతజలపు; సరస్ = సరోవరము; ప్రాంతేందుకాంతోపలోత్పలపర్యంక రమావినోది యగు నాపన్నప్రసన్నుండు - ప్రాంత = సమీపమునగల; ఇందుకాంత = చంద్రకాంత; ఉప = పైన; ఉత్పల = కలువల; పర్యంక = పాన్పుపైనున్న; రమా = లక్ష్మీదేవితో; వినోది = వినోదించుచున్నవాడు; అగున్ = అయిన; ఆపన్న = కష్టాలలోనున్నవారిని; ప్రసన్నుండు = అనుగ్రహించువాడు; విహ్వలనాగేంద్రము - విహ్వల = విహ్వలముచెందినట్టి {విహ్వలము - భయాదులచేత అవయవముల స్వాధీనము తప్పుట}; నాగేంద్రము = గజేంద్రుడు; పాహిపాహి = కాపాడుకాపాడు; యనఁగుయ్యాలించి - అనన్ = అనుచు; కుయ్యాలించి = మొరపెట్టుకొని; సంరంభియై - సంరంభి = వేగిరపడుతున్నవాడు; ఐ = అయ్యి.)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!