అరటిపండు తొక్కమీద కాలువేసి జారి పడ్డారు ఎవరో.

అరటిపండు తొక్కమీద కాలువేసి జారి పడ్డారు ఎవరో. 

.

అంతా నవ్వారు. అదేచోట మీరు జారిపడ్డారు. బాధ పడతారు.

.

ఒకటే చర్య. ఆనందం, దుఃఖం ఎవరి చేతుల్లో ఉన్నాయి? మీ చేతిలోనే కదా! 

.

మామూలుగా, మీ మనసులో సంతోషాన్నిచ్చే ఆలోచనల కన్నా, బాధనిచ్చేవే గుర్తుంటాయి

.

బాధ ఉన్న క్షణాల మళ్ళీ మళ్ళీ ఎందుకు నెమరు వేసుకుంటున్నారు? 

.

పనికి వెళ్ళినప్పుడు, కళాశాలలో పాఠాల బరువుతో కాలం గడిపిన రోజులు,

.

కళాశాలలో వుంటే, బళ్ళో మాష్టారు దగ్గర దెబ్బలు తిన్న సంఘటనలు... 

.

ఎందుకు ఎప్పుడూ జరిగినదాన్నే ఆలోచిస్తూ ఈ క్షణాన్ని గుర్తించడం మర్చిపోతున్నారు. 

ఒక్కొక్కక్షణాన్ని గుర్తించి అనుభవించగలిగితే, ప్రతిక్షణం సంతోషమే కదా?

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!