శ్రీకాళహస్తీశ్వర మహత్యం,ధూర్జటి,పరమశివుడు!(2)

శ్రీకాళహస్తీశ్వర మహత్యం,ధూర్జటి,పరమశివుడు!

.

శా|| వాణీవల్లభ దుర్లభంబగు భవద్ద్వారంబున న్నిల్చి, ని

ర్వాణశ్రీ జెఱపట్ట జూచిన విచారద్రోహమో, నిత్య క

ణ్యాణ క్రీడల బాసి, దుర్దశలపాలై, రాజలోకాధమ

శ్రేణీ ద్వారము దూర జేసి తిపుడో శ్రీకాళహస్తీశ్వరా! 

తా|| ఈశ్వరా! బ్రహ్మాదులకు గూడ అలభ్యమైఅ 

నీ యింటి సింహద్వార దేశమున నిలిచి ముక్తికాంతను చేపట్టుద మను ఆలోచన,

నా వంటి అల్పుడు చేసినందువల్లనో యోమోకాని,

నీ సేవాభాగ్యమునకు దూరమై,

అధములైన రాజులను సేవించు నట్లు చేసినావు గదా!

.

శా||అంతా మిథ్య తలంచి చూచిన నరుండట్లౌ టెరింగిన్ సదా

కాంతల్ పుత్రులు నర్థముల్ తనువు నిక్కంబంచు మోహార్ణవ

భ్రాంతింజెంది చరించుగాని, పరమార్థంబైన నీయందు దా

జింతాకంతయు జింత నిల్పడు గదా, శ్రీకాళహస్తీశ్వరా! 

.

తా|| ఆలోచించినచో ఈ జగతత్తంతయును మాయయేగదా!

మానవు డా సంగతి తెలిసియుండియు, భార్యయు, పుత్రులు, 

ధనములు, తన శరీరము అన్నియు శాశ్వతములని భావించి 

మోహమునొందుచు, జీవనమునకు పరమార్థభూతుడైన 

నిన్ను మనసులో ఒక్క నిమిషమైననను ధ్యానించడు గదా! 

ఎంత అజ్ఞానము!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!