చిలకమర్తి , పానుగంటిగార్ల వ్యంగ్యం!

చిలకమర్తి , పానుగంటిగార్ల వ్యంగ్యం!

చిలకమర్తి వారు, పానుగంటివారు సమాజోద్ధరణకోసం వ్యంగ్యాన్నే అస్త్రంగా చేసుకున్నారు. పానుగంటివారి వ్యాసాల్లో….

అఖిలాంధ్రదేశములోని దోమలు తమ మత్కుణమశక మూషాకాది సభ జరుపుకుని దానికి ఒక మూషికరాజాన్ని అధ్యక్షస్థానంలో కూర్చుండబెట్టాయి.

అందులో నరులవలన తమజాతికి జరుగుతున్న దాడులగురించి ప్రస్తావిస్తాయి…

“నరజాతి యంతటి తుచ్ఛజాతి ప్రపంచమున మరియొకటిలేదు. 

నరుడు మనకు శత్రుడు…తానే మహావీరుడట ! వీరాధివీరుడట …వీని గర్వము కాలిపోను! పిరికిపందలలో అగ్రగణ్యుడెవ్వడు ? నరుడు. తెలిసినదా ? (సెబాస్,, సెబాస్ అని కేకలు.)…

తేలుని జూచి భయమా ? జెర్రిని గాంచి యేడుపా ?

పామును జూచి పరుగా?..దోమ కరచిపోనేమోనని సాయంకాలమగుసరికి సన్నని గుడారములో దూరినవాడు వీరుడా ? 

మన నల్లిపోతులలో నొక్కటి ప్రక్కజేరి కటుక్కున నంటబొడిచిన యెడల కల్లుద్రావిన వానివలె తయితక్కలాడువాడు ధీరుడా ?…” ఇలా సాగుతుంది.

ఓ దోమ తన ఉపన్యాసంలో ఇంకా దారుణమైన విషయం చెప్తుంది…..దోమజాతిలో ఇంతకు పూర్వమంత స్త్రీ వాంఛలేదట. ఏదో ఆయా కాలాలలోనే ఉండేదట… ఇప్పుడు అలా కాలం పాడు ఏమీ లేదట.. ఎప్పుడూ అదే చింత…దీనికి కారణం మనుష్యుల రక్తం పానం చేయడం వలనట……(ఎంత వ్యంగ్యం)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!