శూర్పణఖ రావణుని యెదుట సీతాసౌందర్యమును వర్ణించుట.!

శూర్పణఖ రావణుని యెదుట సీతాసౌందర్యమును వర్ణించుట.!

(రామాయణము, అరణ్యకాండము - మొల్ల:)

.

కన్నులు కలువలో? కాము బాణంబులో?

తెలివిగా నింతికిఁ దెలియరాదు,

.

పలుకులు కిన్నెర పలుకులో? చిలుకల

పలుకులో? నాతి కేర్పఱుపరాదు,

.

అమృతాంశుబింబమో? యద్దమో? నెమ్మోము

తెంపుతో సతికి భావింపరాదు.

.

మన్మధుడికి పంచబాణుడు అని కూడ పేరుంది.

ఆ ఐదు బాణాలు: అరవిందము (తెల్ల కలువ), అశోకము, మామిడి పూవు, నవమల్లిక, నల్ల కలువ:

.

అరవిందమశోకంచ

చూతంచ నవమల్లికా

నీలోత్పలంచ పంచయితే

పంచబాణస్య సాయకాః

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!