పిట్టలారు.!

పిట్టలారు.!

రామ జననమయ్యక...కల్పవృక్షంలో ఒక పద్యముంటుంది.

..

వెలికి గొనిపోకుడీ బిడ్డబిట్టలారు

సంజవేళల నంచు గౌసల్య పలుక

గరుడి వైకుంఠమున భయకంపితుండు

మడమలను ద్రొక్కుకొను ఱెక్క ముడుచుకొనుచు

..

దానికి వ్యాఖ్యానాన్నందిస్తూ 

"ఈ భాగమంతయూ తెలుగుల ఇండ్లలో పురుళ్ళు, 

పిల్లలు పెరుగుటలు వారినాడించుటలు, ఆ మహాశోభ ఉన్నది. 

వట్టి కావ్యకఠిన బుధ్ధులకుతెలియదు. అంతయు రసభరితముగానుండును. 

ఆ రసము జీవితమందున్నది. తెలుగుగృహములలోనున్నది. ఇచ్చటకవిచేసినది పద్యములు వ్రాయుట మాత్రమే. 

తెలుగు దేసములో నేడాదిదాటని పిల్లలను 

సాయంకాలమందు నారుబయతకు దీసుకొనిపోనీయరు.

పిట్టలారునందురు. పూర్వము పసిపిల్లలకదియొక జబ్బువచ్చెడిది.

అట్లు రామచంద్రుని గూర్చి ఎవ్వలైన ననగా 

గరుత్మంతుడు భయముతో తన ఱెక్కలను ముడుచుకొనెడివాడట" అన్నారు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!