మారీచ సుబాహువులు .!

మారీచ సుబాహువులు .!

.

విశ్వామిత్రుడున్నూ నియతేంద్రియుడై దీక్షస్వీకారం చేశాడు. తెల్లవారగానే రామలక్ష్మణులు విశ్వామిత్రుణ్ణి చూసి మహాత్మ! ఆ రాక్షసులను ఎప్పుడు సంహరించాలో అది విశదం చెయ్యి అని అడిగారు. అక్కడ వున్న మునులు " ఇది మొదలు ఆరు రాత్రింబగళ్ళు ఈ ఆశ్రమం రక్షించవలసి వుంది. విశ్వామిత్రమహర్షి యజ్ఞదీక్షలో ఉన్నారు. అంచేత ఆయన మాట్లాడగూడదు" అని చెప్పారు.

రామలక్ష్మణులు ఆరురోజులూ వారిని రక్షించారు. ఆరొవనాడు యజ్ఞం జరుగుతూ వుండగా ఆకాశాన భయానకమైన గొప్పద్వని పుట్టింది. మారీచుడూ సుబాహుడూ లెక్కలేనంతమంది రాక్షసులతో వచ్చి రక్తవర్షం కురిపించసాగారు. రామలక్ష్మణులు అది చూశారు. "లక్ష్మణా! మానవాస్త్రం ప్రయోగించి యీ దుష్టులను ఎగరగొడతాను చూడు" అని చెబుతూనే అస్త్రంతో మారీచుని గుండెలమీద కొట్టాడు. ఆ అస్త్రం నూరుమాడల దూరం యెగరగొట్టి మారీచుణ్ణి సముద్రంలో కూలగొట్టింది. మానవాస్త్రం ప్రాణాలు తియకుండా దూరంగా విసిరేస్తుంది. రాముడు ఆగ్నేయాస్త్రంతో సుబాహువు గుండెలమీద పెట్టికొట్టాడు. వాయవ్యాస్త్రంతో కొట్టి తక్కిన వాళ్ళనందరినీ కూడా నాశనం చేసి రాముడు మునులకు సంతోషం కలిగించాడు.

అది చూసి మహర్షులందరూ అనేక విధాల పొగిడి రామలక్ష్మణులను పూజించారు. తరువాత యజ్ఞం పూర్తి అయింది. అప్పుడు విశ్వామిత్రుడు దిక్కులన్నీ నిరుపద్రవంగా వుండడం చూసి "రామా! మహాబాహూ! నువ్వు గురువచనం చెల్లించావు. నిజంగా యిది సిద్ధాశ్రమం అనిపించుకుంది" అని చాలా ఆనందించాడు.

Rama looked up and saw two rakshasas Maareecha (son of Taataka) and Subaahu and their followers preparing to shower unclean things on the Yagna fire. The army of Raakshasas covered the sky like a great black cloud.

Rama said, "Look Lakshmana," and let go the (Wind-arrow) Maanava-astra at Maareecha. As was intended, it did not kill Maareecha, but wrapping him up in resistless force hurled him a full hundred miles near the sea.

With the (FIRE-arrow) Aagneya-astra Rama killed Subaahu; and then the two princes totally destroyed the entire army of Raakshasas.

The sky was bright again.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!