సుత్తుల్లో చాలా రకాలున్నాయి!

సుత్తుల్లో చాలా రకాలున్నాయి. బోల్డ్ ఉన్నాయ్ కదా ఆహాఆహాఆహా ఆహాఆహాఆహా

ఒకడు ఠంగు ఠంగుమని గడియారం గంట కొట్టినట్లు సుత్తేస్తాడు. మీ నాన్న గారిలాగా . హ హ హ. దాన్ని ' ఇనప సుత్తి ' అంటారు. అంటే ' ఐరన్ హేమరింగ్ 'అన్నమాట. 

( సుత్తివీరభద్రరావు )

ఇంకోడు సుత్తేస్తున్నట్లు తెలియకుండా మెత్తగా వేస్తాడు-రబ్బరు సుత్తి. అంటే ' రబ్బర్ హేమరింగ్ ' అన్నమాట.

.

ఇంకోడు ప్రజలందరికీ కలిపి సామూహికంగా సుత్తేస్తాడు - ' సామూహిక సుత్తి ' దీన్నే మాస్ హేమరింగ్ అంటారన్నమాట. అంటే రాజకీయ నాయకుల మీటింగులూ ఉపన్యాసాలు ఈ టైపు. 

.

పోతే ఇంకో టైపుంది. మీ నాన్నగారు నాకు సుత్తేద్దామని వచ్చారనుకో, నేనే ఎదురు తిరిగి మీ నాన్నగారికి సుత్తేశాననుకో- అహ, ఉత్తినే అనుకుందాం. ఇది జరిగే పని కాదనుకో. దాన్నే ఎదురు సుత్తి అంటారు. అంటే ' రివర్స్ హేమరింగ్ ' అన్నమాట. 

.

ఇలా చెప్పుకుంటూ పోతే, నాది సుదీర్ఘ సుత్తి అవుతుందమ్మా.

అంటే ' ప్రొలాంగ్డ్ హేమరింగ్ 'అన్నమాట.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!