🌹'ప్రేమనుతొలగిస్తే ఈ భూగోళం ఒక సమాధి'' 🌹

🌹'ప్రేమనుతొలగిస్తే ఈ భూగోళం ఒక సమాధి'' 🌹


🏵️


సౌరభములేల చిమ్ము పుష్పవ్రజంబు?

చంద్రికలనేల వెదజల్లు చందమామ?


ఏల సలిలంబు పారు? గాడ్పేల విసరు?

ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను?

.. 

మావిగున్న కొమ్మను మధుమాసవేళ

పల్లవము మెక్కి కోయిల పాడుటేల?


పరుల తనయించుటకొ? తన బాగు కొరకొ


గానమొనరింపక బ్రతుకు గడవబోకొ?


''-అని దేవులపల్లి కృష్ణశాస్త్రి ప్రేమ సహజమైందని, స్వార్థం లేనిదని,


ప్రతిఫలాన్ని కోరదని, యాదృచ్ఛికమైందని చెప్పాడు. ప్రేమ అనే


రెండక్షరాలకు సంతోషం, ఇష్టం, స్నేహం, చెలిమి అనే అర్థాలున్నాయి-


ప్రేమ ప్రాధమికంగా ప్రకృతి పురుషులకు సంబంధించింది.


మానవుడు ప్రకృతిని ప్రేమిస్తాడు. ప్రకృతిలోని సుందర దృశ్యాలను,


చెట్లను, సెలయేళ్లను, కొండల్ని, గుట్టల్ని, ఆకాశాన్ని, సూర్యచంద్రాదుల్ని,


నక్షత్రాల్ని, మేఘాల్ని, మెరుపుల్ని ఇష్టపడతాడు. ఒక పురుషుడు


ఒక స్త్రీని ఇష్టపడతాడు. ఒక స్త్రీ ఒక పురుషునితో, స్నేహం


చెయ్యాలనుకొంటుంది. కారణం మనసు-మనసు దేన్ని కోరుకొంటోందో


దానిమీద ఇష్టం కలుగుతుంది. దాని సాన్నిహిత్యంలో సంతోషం


కలుగుతుంది. దాని సాహిత్యం కోసం అర్రు చాస్తుంది.


ప్రేమ పలువిధాలుగా ఉంటుంది. మాతృప్రేమ, పితృప్రేమ, భాతృప్రేమ,


సోదరీ ప్రేమ, మిత్రప్రేమ, బంధుప్రేమ మొదలైన రీతిలో ఉంటుంది.


అన్నిటి కంటే మించిందిగా మాతృప్రేమను చెబుతారు. తనబిడ్డ


ఎంతపెద్ద వాడైనా, పెద్దదైనా మాతృమూర్తికి చిన్నగానే కనిపించటం,


ఈ ప్రేమలోని మహత్త్యం.


ఇప్పుడు ప్రేమకు అర్థాలు మారిపోయాయి. మారిపోతున్నాయి.


ఎదుటివారి పట్ల మనం ప్రేమను ప్రకటిస్తే ఎదుటి వారు మనల్ని


ప్రేమిస్తారు. అంతేకాదు ద్వేషం ద్వారా దేన్నీ సాధించలేము''


కత్తినెత్తి జయించనిది కరుణతో సంపాద్యము- ద్వేషముతో లభించనిది-


ప్రేమతోడ సంపాద్యము'' అంటాడు సి.నా.రె.


పరస్పర ప్రేమను మించిన స్వర్గం లేదని పెద్దలంటారు.


. ప్రేమించి విఫలమవ్వటమూ మంచిదే నంటూ బసవరాజు అప్పారావు


''వలపెరుంగక బ్రతికి, కులికి మురిసేకంటే -


వలచి విఫలమ్మొంది విలపింపమేలురా'' అని చెప్పాడు.


వలపులేని బ్రతుకు పనికిరానిదని బసవరాజు భావం.

ప్రేమ వైఫల్యమూ ఒక మధుర అనుభవాన్ని ప్రసాదిస్తుం దని కవిభావం.


ప్రేమించమని అర్ధించటం, వేధించటం కంటే ఆత్మగౌరవ హీనత


మరొకటి లేదు. ఎదుటి వారు మనల్ని ఇష్టపడేటట్లు మనం ప్రవర్తించాలి. మన ప్రవర్తన ఇతరులకు కష్టాన్ని కలిగించకూడదు. ఆదర్శంగా ఉండాలి. మార్గదర్శకంగా ఉండాలి.


ప్రేమికులు ఎప్పుడూ పరస్పరం పోట్లాడుకోకూ డదనే అనుకొంటారు.


కానీ ప్రేమ ఒక పోరాటం. నిజమైన ప్రేమ ఎప్పుడూ ప్రశాంతంగా,


సజావుగా కొనసాగదు. నిజమైన ప్రేమలో తాత్కాలిక కలహాలు సహజం.


''ఇతరుల్ని ప్రేమించటం వల్ల మానవునికి నిరవధికానందం సిద్ధిస్తున్నది.


మనం ఒకరికిచ్చే ప్రేమ మళ్లీ మనకు ప్రేమను కొనితెస్తుంది. ఒకరినొకరు


ప్రేమించుకోవటం ఎంతో మహత్తర మైన కార్యం. ఈ భూమి మీదకు


స్వర్గం దిగివచ్చి నంత. అంతేకాదు భూలోక స్వర్గమే''.


''ప్రేమనుతొలగిస్తే ఈ భూగోళం ఒక సమాధి''


అన్న మహానుభావుని సూక్తిని గుర్తుంచు కొని ప్రతి ప్రాణిని ప్రేమించటం


అలవాటు చేసుకోవాలి.

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️ 🌹🌹🌹🌹🌹🌹🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!