🙏కల్పవృక్షం... ఖండనం 🙏

🙏కల్పవృక్షం... ఖండనం 🙏


🤲🤲🤲🤲🤲🤲🤲


సందర్భం వచ్చింది కాబట్టి ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షము’ గురించి

కొన్ని విషయాలు...


👉విశ్వనాథ సత్యనారాయణ (1895- 1976) పద్యకావ్యంగా దీన్ని రాశారు.


👉ఈ రచన 1932లో ప్రారంభమైంది. 1944- 1962ల మధ్య


అన్నికాండలముద్రణా పూర్తయింది.


👉ఈ రచనలో శబ్ద- అర్థపరంగా, ఛందోపరంగా ఉన్న లోపాలన్నీ


వివరంగా పేర్కొంటూ కొత్త సత్యనారాయణ చౌదరి (1907- 1974)


‘కల్పవృక్ష ఖండనము’ రాశారు.


👉ఈ విమర్శ ‘భారతి’లో 1961 జూన్-అక్టోబరుల మధ్య ప్రచురితమై,


సంచలనం సృష్టించింది.


👉దానిపై ‘ఆంధ్రపత్రిక సారస్వతానుబంధం’లో సుదీర్ఘ చర్చ జరిగింది.


👉ఈ చర్చనంతటినీ ఒకచోట కూర్చి 1962 జనవరి భారతి సంచికతో


పాటు అందించారు.


ఇంత వివాదం జరిగినా 1970లో రామాయణ కల్పవృక్షానికి


జ్ఞానపీఠ బహుమతి వచ్చింది!


మరి ‘రామాయణ విషవృక్షం’ సంగతేమిటి?


ఇది వాల్మీకి రచించిన రామాయణంపై "మార్క్సిస్టు దృక్పథం"తో


చేసిన పరిశీలన, విమర్శ. ఇది వ్యాసాలుగా కాకుండా.. కథల రూపంలో


ఉంటుంది. అవసరమైనచోట వాల్మీకి మూలగ్రంథంలోని శ్లోకాలూ,


వాటి తెలుగు అర్థ తాత్పర్యాలూ, వివరణలూ ఫుట్ నోట్లుగా ఉంటాయి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!