పితృ తర్పణాలు

పితృ తర్పణాలు

-

ఇంట్లో భగవంతునికి చేసే పూజతో సమానమైన ఫలితం 

పితృ ఖర్మ చేయడం అని వేదం చెపుతోంది.


పితృ కర్మ పవిత్రమైనది. 

శుభ కార్యాలు ఉన్నాయి అనే పేరుతో చేయాల్సిన 

పితృ తర్పణాలు మాని వేయడం సరికాదు.

దురదృష్టవశాత్తు పెళ్లి అయిన సందర్భంగా శ్రాద్ద కర్మలు చేయకూడదు అనే తప్పుడు అభిప్రాయం తో ప్రజలు ఉన్నారు. ఇది 100 % సరి కాదు.


వేదాలను అనుసరించే వారికి కర్మ-కాండలు (శ్రాద్ధ-విధి) నిర్వహించడం ఆచార కర్మగా చెప్పబడింది. గతించిన తమ పూర్వీకుల ఆత్మకు ముక్తి కలగడానికి సాంవత్సరికాలు చేస్తూ పితృతర్పణాలు వదులుతారు. ప్రకృతి వైపరీత్యాలలోనో, ప్రమాదాల లోనో, ఆత్మహత్య చేసుకునో అర్థాంతరంగా చనిపోయిన వ్యక్తులకు వెంటనే మరొక దేహం లభించక పోవచ్చు. అటువంటి వారికి తమ పుత్రులు, పౌత్రులు పిండ ప్రదానం చేసి తర్పణాలను వదలడం ద్వరా మళ్ళీ తమకు తగిన భౌతిక దేన్ని పొందగలుగుతారు

భగవంతుడైన నారాయణుడికి లేదా ‘ఆర్యముడు’ అనే దేవుడికి నైవేద్యం అర్పించి సేవించడం కుటుంబ సభ్యులు, ముఖ్యంగా కొడుకుల విధి. నేటికీ మనదేశంలో ‘గయ’ కు వెళ్ళి విష్ణుపాదాలకు పిండములు సమర్పించి తర్పణములు వదలడం ద్వరా ప్రేతాత్మ రూపంలో ఉన్న తండ్రికి మళ్ళీ స్థూల దేహం లభ్యమయ్యేలా వారి సంతతి చేస్తూ ఉంటారు. చనిపోయిన వారందరు ప్రేతాత్మలు అవుతారని కాదు. కానీ ఈ విధంగా చేయడం వలన తప్పనిసరిగా వారికి ఉత్తమ గతులు లభిస్తాయి. విష్ణుప్రసాదాన్ని స్వీకరించడం వలన వారికి హీనజన్మలకు వెళ్ళకుండా మళ్ళీ మనిషి జన్మను పొందే భాగ్యం లభిస్తుంది.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!