🌹🌹🌹 "మంత్ర పుష్ప సమర్పణం🌹🌹🌹

🌹🌹🌹 "మంత్ర పుష్ప సమర్పణం🌹🌹🌹

🌹" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ "🌹

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏


ఏ ఉపాయం చేతనైనా , ఈశ్వరుడి అను గ్రహాన్ని


సంపాదింౘవలసినఅవసరం ఉంది.


దానికిగల సులభోపాయాన్ని శంకరులు ఈ శ్లోకంలో చెపుతున్నారు .


ఆసులభోపాయం తెలుసుకో లోని మందబుద్ధులను ౘూసి ,


శంకరులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.


శ్లో" గభీరే కాసారే _ విశతి విజనే ఘోరవిపినే


విశాలే శైలేచ _ భ్రమతి కుసుమార్థం జడమతిః


సమర్ప్యైకం చేతః _ సరసిజ ముమానాథ! భవతే


సుఖేనావస్థాతుం జన ఇహ నజానాతి కి మహో !!


తాత్పర్యము:


ఓ పార్వతీపతీ ! మందబుద్ధియైన మనుష్యుడు నిన్ను పూజింౘడానికి,


పూవులకోసం లోతైన తటాకం లోనికి దిగుతాడు. నిర్జనమైన,


భయంకరమైన అరణ్య మందూ, పెద్ద పర్వతమునందూ తిరుగుతాడు.


అతడు తనలోనే వున్న తనమనస్సు అనే పద్మమును


నీకు సమర్పించి,, ఈ లోకంలో సుఖంగా ఎందుకు ఉండటం


లేదో నాకు ఆశ్చర్యంగా ఉంది.


మనస్సు పెట్టి భక్తితో పూజింౘడం ముఖ్యం. అంతేకానీ ,


పుష్ప సేకరణకైపాటు పడటం ముఖ్యం కాదని భావం.


వివరణ:


" మనః పుష్పమ్ సమర్పయేత్". అనగా మనస్సు అనే పుష్పాన్ని 

భగవంతుని కి అర్పింౘడమే ముఖ్యమైన పూజ. మనః పుష్పాన్ని

భగవంతునికి అర్పించే స్థితి వచ్చేవరకూ , గీతలో భగవంతుడు 

చెప్పినట్లుగా " పత్రం, పుష్పం, ఫలం, తోయం" అనగా బిల్వ, తులసీ

దళములు, పుష్పములు,ఫలములు, ఉదకము మొదలయినవి 

సమర్పిస్తూ భగవంతుని పూజింౘడం మనవిధి. బాహ్య పుష్పముల

ద్వారానూ,మనఃపుష్పముల ద్వారానూ కూడా పరమాత్ముని పూజించే

నేర్పు సంపాదిస్తే , దానికి మించిన స్థితి లేదు. అట్టి స్థితి మునులకు

ఋషులకు మాత్రమే ఉంటుంది.


పుష్పాన్ని మనం హృదయం దగ్గఱ పెట్టుకొని తరువాత భగవంతుని

పాదాల దగ్గఱ మెల్లగా ఉంౘుతారు. అంటే అది తాను సమర్పించిన

బాహ్యపుష్పం కాదని, తన హృదయ పుష్పం అనీ అర్థం. భగవంతుడు

భావగ్రాహి గానీ , వస్తుగ్రాహి కాడు. దీపాన్ని ౘూపింౘడం , ధూపం

సమర్పింౘడం ,నైవేద్యం పట్టడం వంటి ఉపచారాలతో " ప్రభూ! నీవు

మాకిచ్చిన సొమ్ము ను నీ అనుమతితో మేము అనుభవిస్తున్నామని 

తెల్పడమే , షోడశోపచారాలకు నిజమైన అంతరార్థము.


పరమాత్మకు పుష్పము అంటే ప్రీతి. అదే పుష్పాన్ని మంత్రపూతం చేసి

సమర్పింౘడాన్ని " మంత్ర పుష్ప సమర్పణం" అంటారు.


🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!