తెలుగుతెలుసుకోండి.(4.) ద్వితీయా విభక్తి!270916.

తెలుగుతెలుసుకోండి.(4.) ద్వితీయా విభక్తి!

ని,ను,లన్, గూర్చి,గుఱించి

(క) కర్మ సూచక ప్రత్యయాలు

నామవాచకాన్ని కర్మగా ఉపయోగించేటప్పుడు ద్వితీయావిభక్తి ప్రత్యయాలు ‘ని’ లేదా ‘ను’ జోడించాలి. బహువచనంలో ‘లన్ ‘ ప్రత్యయం వచ్చి, ‘లను’ గా మారుతుంది.

ఉదా: కృష్ణుడు వెన్నను దొంగిలించెను.

పై వాక్యంలో ‘కృష్ణుడు’ అనే నామవాచకం కర్త కాబట్టి ప్రథమావిభక్తిలోనూ ‘వెన్న’ నామవాచకం కర్మ కాబట్టి ద్వితీయావిభక్తి లోనూ (‘ను’ అనే ప్రత్యయం చేర్చి) ఉపయోగించబడింది.

ఇలాగే రాతిని, వేణువును, కన్నులను,తమ్ములను మొదలయిన పదాలు ఏర్పడతాయి.

ఆంగ్ల భాషలో ఈఅర్థం కేవలం పదాల వరుస వలనే వస్తుంది. వేరే preposition అంటూ ఏమీ ఉండదు.

తెలుగులో కూడా చాలాసార్లు ఈ ప్రత్యయాలను వాడకుండానే వాక్యాలు నిర్మిస్తారు.

ఉదా: తరుణ్ పుస్తకం చదువుతున్నాడు (పుస్తకాన్ని)

నేను అన్నం తింటాను (అన్నాన్ని).

(గ) గూర్చి/గుఱించి – ఈ ప్రత్యయాలను ‘about’ అనే ఆంగ్లపదం అర్థంలో వాడతారు. వీటి రెండింటి అర్థం ఒకటే – ‘గూర్చి’ కొంచెం గ్రాంథికం; ‘గుఱించి’ వాడుకభాష.

ఉదా:

సీతను గూర్చి హనుమంతుడు అన్వేషించెను.

ఈ నాటకం గుఱించి రెండు మాటలు.

గూర్చి, గుఱించి కూడ ని/న/లన్ కలుపుకునే వస్తాయి… ని/ను/లన్ కలుపుని వచ్చే నామ వాచక పదాలకు.

ఇదీ ద్వితీయావిభక్తి పై ఈ వారం సమీక్ష.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!