పోతనామాత్యు ని పరమభక్తి పద్యం!

ఓ జగన్నివాసా! శిష్టరక్షణ కోసమే నీవీ జగత్తులో అవతరిస్తావు!

(పోతనామాత్యు ని పరమభక్తి పద్యం.)

.

"పద్మలోచన! కృష్ణ! భక్తాభయప్రద! ;

వినుము, సంసారాగ్నివేఁగుచున్న

జనుల సంసారంబు సంహరింపఁగ నీవు; 

దక్క నన్యులు లేరు దలఁచి చూడ

సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు; 

ప్రకృతికి నవ్వలి ప్రభుఁడ వాద్య

పురుషుండవగు నీవు బోధముచే మాయ; 

నడఁతువు నిశ్శ్రేయసాత్మ యందు

-

మాయచేత మునిఁగి మనువారలకుఁ గృప

సేసి ధర్మముఖ్యచిహ్నమయిన

శుభము సేయు దీవు సుజనుల నవనిలోఁ

గావఁ బుట్టుదువు, జగన్నివాస!

భావము:

“పద్మాక్షా! భక్తజనరక్షాపరాయణా! శ్రీకృష్ణా! సంసారాగ్నిలో తపించిపోతున్న జనుల కష్టాన్ని పోగొట్టటం నీకు తప్ప మరొకరికి శక్యం కాదు. నీవు సాక్షాత్తూ సర్వేశ్వరుడవు. ఈ ముల్లోకాలకు అవ్వలివాడవు. ఆదిపురుషుడవైన ప్రభుడవు నీవు ముముక్షువులకు జ్ఞానాన్ని ప్రసాదించి మాయను మటుమాయం చేస్తావు. నీవు మాయాజాలంలో మునిగిన వారికి ధర్మసమ్మతమైన తేజస్సును అనుగ్రహిస్తావు. ఓ జగన్నివాసా! శిష్టరక్షణ కోసమే నీవీ జగత్తులో అవతరిస్తావు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!