ఈ నగరానికి ఏమయింది ? ( పొగత్రాగడం..ఆరోగ్యానికి హానికరం)

ఈ నగరానికి ఏమయింది ?

( పొగత్రాగడం..ఆరోగ్యానికి హానికరం)

(చమత్కార చాటువులు)

.

విష్ణు మూర్తిని చూడటానికి నారదుడు వైకుంఠం వెళ్ళాడుట..

అపుడ స్వామి పొగ త్రాగుతున్నాడట.. ! 

చూడగానే ఆశ్చర్యంతో నారదుడు;;

మీరుం బొగ ద్రాగుదురా?

వారిజ భవ వాసు దేవ వైకుంఠ హరీ!!'' అని అడిగాడట

ఓరీ!నారద వినరా!!

ఈరేడు జగంబులందు నిది ముఖ్యము రా!!!! అన్నాడట..శ్రీ హరి

పొగ త్రాగ నేర్చి భీముడు

పరగన్ పొగరడచచెనాజి బాహా శక్తిన్

పొగ త్రావని దుర్యోధను

డిగిలించెను రణములోన ఇహిహీ యనుచున్..

ఇది సేకరణ లో భాగం గ పెట్టిన టపా..చాటువుల నుంచి.. ఎవరి మనోభావాలనూ,మతప్రమేయంగా దెబ్బతీసేందుకు కాదని..సవినయ మనవి..చదివి వెంట నే విస్మరించెదరు గాక..

పొగ త్రాగువారి ని ఉత్సాహపరిచడం కూడా కాదు.. గమనించ ప్రార్ధన

.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!