వసుచరిత్రము అనే ప్రభంధం లోనిపద్యం.!

వసుచరిత్రము అనే ప్రభంధం లోనిపద్యం.!

(విశ్లేషణ ఆచార్య.. చొప్పకట్ల సత్యనారయణగారు.)

మ. సతి యూరుద్యుతి జెందఁబూని నిజదుశ్చర్మాపనోద క్రియా

రతి పాథోలవ పూరితోదరములై రంభేభ హస్తంబులు

న్నంతఱిన్, వీడె మరుద్విభూతిఁ గదళిన్ త్వగ్దోషమాచంచలో

ద్ధతశుండాతతి బాయదయ్యె నదెపో తద్వైరమూలంబిలన్.

.

ప్రసిద్ధమైన ఈ పద్యం వసుచరిత్రము అనే ప్రభంధం లోనిది. కవి రామరాజభూషణుడు. ఈయనకు భట్టుమూర్తి అనే పేరు కూడా ఉంది. రామరాజభూషణుడు చాలా గొప్ప కవి. చూశారు గదా.

.

ఆ అందమైన అమ్మాయి పేరు గిరిక.

అమ్మాయి గారి తొడలు కరిశుండానికన్నా, రంభాస్తంభాలకన్నా అందమైనవి. తలక్రిందులుగా తపస్సు చేసినా ఆ రెండూ సతి ఊరుద్యుతిని పొందలేవు. దుశ్చర్మాన్ని పోగొట్టుకుంటే అరటి స్థంభాన్ని కొంచెం పోల్చవచ్చునేమో కానీ, ఏనుగు తొండానికి మాత్రం ఆ అవకాశమూ లేదు. అమ్మాయి ఊరువుల కాంతిని తెలిపేందుకు ఈ పోలికలు, కల్పన చేశాడు కవి.

రంభ (అరటి), ఇభహస్తములు (ఏనుగు తొండాలు), సతి ఊరుద్యుతి జెందబూని, పాథోలవ పూరిత ఉదరములై, నిజ దుశ్చర్మ అపనోద క్రియారతిని ఉన్న తరిన్, మరుద్విభూతి త్వగ్దోషము వీడె కదళిన్, ఆ చంచలోద్ధత శుండాతతి పాయదయ్యె, అదెపో తద్వైర మూలంబు, ఇలన్ —

,

ఏనుగు తొండాన్ని వర్ణిస్తూ మత్తేభ వృత్తంలో వ్రాయడం బాగున్నది.

https://www.blogger.com/blogger.g…


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!