మిణుగురులు! (మహాకవి గురుజాడ అప్పారావు గారు.)

మిణుగురులు!

(మహాకవి గురుజాడ అప్పారావు గారు.)

అరటికాయ బజ్జి

మినప్పప్పు సొజ్జి

కలసి మెలసి తిందాం

కధలు విధలు విందాం

ఏనుగు ఎక్కి మనము

ఏ వూరెళదాము?

ఏనుగు ఎక్కి మనము

ఏలూరెళదాము!

,

గుఋఋఅం ఎక్కి మనము

ఏ వూరెళదాము?

గుఋఋఅం ఎక్కి మనము

గుంటూరెళదాము!

మోటారెక్కి మనము

ఏ వూరెళదాము?

మోటారెక్కి మనము

మోటూరెళదాము!

వెన్నుని ఎక్కి మనము

ఏ వూరెళదాము?

వెన్నుని ఎక్కి మనము

వెయ్యూళ్ చూద్దాము!

( భారతి 1930).

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!