మధుర భక్తి!

మధుర భక్తి!

సుమారు క్రీశ:1670; ప్రాంతంలో పుసులూరి సోమరాజనేకవి జీవిచాడు. ఆయన శ్రీకృష్ణునిపై ెఅనేక భక్తి శతకాలు రచించాడు. గోపాల శతకం, నందనందనశతకం, ఇందుశతకం, మొదలయినవి. ఇవన్నీ పూర్తిగా మధుర భక్తితో నిండినవి. నందనందన శతకంలోని యీపద్యాన్ని చిత్తగించండి.

ఉ: పుక్కిట తమ్ములమ్మడుగ బోటికి నోటికి నియ్యజూచి, వే

రొక్కతె కోపగింప కనకోత్పలమాలిక లిచ్చినట్టి మే

లిక్కడ చూప వచ్చితి భళీ! యను రాధిక నూరడించు నీ

చక్కదనంబు జూడమనసైనది, చూపుము నంద నందనా!

తమ్ములమంటే బాగా నమిలిన తాంబూలం. ప్రేమించినవ్యక్తి, లేక భార్య లేదాభర్త , తాంబూలం నములుతూఉంటే, తమ్మనాకు బెట్టమని యడగటం ప్రేమకు నిదర్శనం. అది యామెకు బెట్టకపోగా, బంగారు కలువపూదండను వేరొకతె కిస్తున్నాడట కొంటెకృష్ణుడు. మరి రాధమ్మకు కోపంరాదా? రాధకు కృష్ణునిపైగల యధికాపము, చనవు అట్టివి. అలాఆమెయలిగినవేళ ఆమెను బ్రతిమిలాడే కృష్ణయ్య అందాన్ని చూచిన వారిదే భాగ్యం! అంటాడుకవి. బాగుందికదూ?

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!