వేమన పద్యాలు - విమర్శ!

వేమన పద్యాలు - విమర్శ!

ఇతరుల సొమ్ముకు ఆశించే లక్షణం “వెన్నదొంగ”లోనూ కనిపిస్తింది. 

.



పాలకడలిపైన పవ్వళించినవాడు

గొల్ల ఇండ్ల పాలు కోరనేల?

ఎదుటివారి సొమ్ము ఎల్ల వారికి తీపి

విశ్వదాభిరామ వినురవేమ.

.


పై పద్యం చదివితే వేమన శ్రీ కృష్ణుని ఇతరరుల సొమ్ము ఆశించేవానిగా అర్ధం చేసుకున్నట్లు కనబడుతుంది. ఆయన దైవత్వాన్నే ప్రశ్నిస్తున్నట్లు కనబడుతుంది. 

ఇది ఆయన ఆమాయకత్వమో , లేదా ఆఘాయిత్యమో తెలియదు కానీ, ఒక్కటి మాత్రం నిజం. శ్రీ కృష్ణ తత్వము ఆయన సరిగా అర్ధం చేసుకోలేదు అనే మాట మాత్రం నిజం అనిపిస్తుంది. 

‘ఏతస్యాంశకలాః పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయమ్’’ ఇతరావతారాలన్ని పరమాత్ముని అంశలూ, అయితే శ్రీకృష్ణావతారం మాత్రం సంపూర్ణావతారమనీ, కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడేనని భాగవతం ద్వారా మనకు తెలుస్తుంది.

కృష్ణం వందే జగద్గురుం అని చెప్పుకుంటాం. కృష్ణుడు ధర్మసంస్థాపన కోసం పుట్టుకను ఆహ్వానించినవాడు. కర్మయోగి, తత్త్వయోగి స్పూర్తిప్రదాత ఈయనను నవనీత చోరుడని అంటారు. వాస్తవానికి భక్తమానస చోరుడు. నందుని ఇంట్లో నవనీతముకు కొదువ ఏముంది? అదేవిధంగా కన్నయ్య కోరితే కాదు అనేటంతా కఠినాత్మురాలు కాదుకదా యశోదమ్మ మరి ఇరుగు పొరుగు ఇళ్లల్లో నవనీతం ఎందుకు దొంగలించాడు. మనసు అనే పాలను తోడు పెడ్తె ఏకాగ్రతనే పెరుగుగా మారుతుంది. దానిని మధిస్తే భక్తి అనే నవనీతం వస్తుంది. దాని సమర్పించుకోండి. అది మీవ ల్ల కాకపోతే నేను చేయిస్తాను అనే భావన అంతర్లీనంగా ఈ ఘటనలో ఇమిడి ఉంది.

‘మన్నుతిన్నావని’’ యశోదమ్మ అంటే ‘‘అమ్మా! నేనేమైనా వెర్రివాడనా?’’ అన్న ప్రశ్నలో సత్యాసత్యాలు తెలిసిన సర్వజ్ఞుడను నేను అనే సమాధానం మనకు స్ఫురిస్తుంది. ఆయన పరిపూర్ణ భగవానుడై ఉండియు పూర్ణ మానవుని రూపమున ఆదర్శముగా వ్యవహరించడమూజరిగింది. సందేహము లేదు. ఆయన సాక్షాత్తు భగవానుడే. ‘కృష్’ అంటే కర్మ నిర్మూలనం ‘ణ’ అంటే దాస్యభావం, ఆకారం ప్రాప్తి బోధకం. కర్మలన్నింటిని సమూలంగా నాశనం చేసి అనన్య దాస్య భక్తిని, ప్రాప్తింప చేయడం వలన ఆయన్ను ‘కృష్ణుడు’ అన్నారు.

ఈ అమాయక గోపబాలుడు వెన్నదొంగ అయి ఎన్నో అలౌకిక దివ్యలీలలు ప్రదర్శించాడు. భక్తాగ్రగణ్యులైన గోపికలు కృష్ణుని భౌతిక దృష్టితో దేవకీవసుదేవుల పుత్రుడిగా కాక ఆత్మదృష్టితో దర్శించి ఆరాధించారు. అఖిల దేహినా మంతరాత్మదృక్ అని భావగత పురాణం వివరించినట్లు సకల ప్రాణులలోను అంతర్యామియై ఉన్నవాడనే భావనతోనే చూశారు. వారికి జన్మాంతర బంధమున్నది. ధర్మసంరక్షణార్థం మహావిష్ణువు కృష్ణుడుగా అవతరించినప్పుడు, ఎందరో మహర్షులు, దేవతలు గోపగోపీ జనులుగాను, ఆదిశేషుడు బలరామునిగాను ఆ ఆదిదేవుని అనుసరించి జన్మించిన వారే!

ఆ బాలకృష్ణుని దివ్యలీలా చేష్టలకు పరవశించి, కలవరించి, కవులెందరో ఆ వేణుగానలోలుని గుణగణాలను గానంచేసి తరించారు. 

మరి వేమనకు శ్రీ కృష్ణతత్త్వం అర్ధమైనట్లు భావించాలా లేక ఆయన అది నిందాస్తుతి అనుకోవాలా !

రేపు " బంగారు లేడి ఉండదని తెలియని రాముడు దేవుడెలాగయ్యాడు?" అనే విమర్శ కు సమాధానం !

Comments

  1. ఇది వేమన పద్యం అయి ఉండదండి. మూల దైవతత్వానికి, అవతార తత్వానికి తేడా తెలియని వాడు కాడు వేమన.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!