కన్యాశుల్క మంటే, అచ్చ తెనుగులో ' ఉంకువ ' అని అంటారు.

కన్యాశుల్క మంటే, అచ్చ తెనుగులో ' ఉంకువ ' అని అంటారు.

.

"అంకిలి సెప్ప లేదు, చతురంగ బలంబుల తోడ నెల్లి యో

పంకజనాభ! నీవు శిశుపాల జరాసుతులన్ జయించి, నా

వంకకు వచ్చి, రాక్షసవివాహమునన్ భవదీయ శౌర్యమే

యుంకువ సేసి కృష్ణ! పురుషోత్తమ! చేకొనిపొమ్ము! వచ్చెదన్"

.గన్నవరం నరసింహ మూర్తి గారి వివరణ.

వివిధ వివాహాలను చక్కగా వివరించారు సత్యనారాయణ గారూ ! చాలా చాలా ధన్యవాదములు.

ఈ పద్యములో మరో విశేష మున్నది. కన్యాశుల్కము పందొమ్మిదవ శతాబ్దములో క్రొత్తగా రాలేదని ప్రాచీన కాలములో కూడా ఆ సాంప్రదాయమున్నదని యీ పద్యము వలన తెలుస్తున్నది. కన్య కొఱకై మామగారికి అల్లుడు యిచ్చే సొమ్మును సంస్కృతములో కన్యాశుల్క మంటే, అచ్చ తెనుగులో ' ఉంకువ ' అని అంటారు.రుక్మిణీదేవి గడుసుదనమును చూడండి. తనను ఉత్తిపుణ్యానికి తీసుకొని వెళ్ళవద్దని శౌర్యమును ఉంకువగా సమర్పించి తనను స్వీకరించమని శ్రీకృష్ణునకు సూచిస్తున్నది. మఱి అది

" రాచమర్యాద " కదా !

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!