శ్రీపాదసుబ్రహ్మణ్యశాస్త్రిగారి కథ వడ్లగింజలు ..చదరంగం.

శ్రీపాదసుబ్రహ్మణ్యశాస్త్రిగారి కథ వడ్లగింజలు ..చదరంగం.

శ్రీమతి (శారద పోలంరాజు గారికికృతజ్ఞలతో.)

ఈ కథ 1941 ఆంధ్రవారపత్రిక లో ప్రచురించబడింది.

తంగిరాల శంకరప్ప చదరంగ ఆటలో నేర్పరి.

రాజుగారికి కూడా చదరంగం మీద ఆసక్తి ఉన్నదని, ఆయనను కలుసుకోవటానికి నానా కష్టాలు పడి చివరకు రాజుగారికి అతని నైపుణ్యం గురించి తెలిసి,

ఒకరోజు గుర్రం పంపించి ”గుర్రం మీద రమ్మని” కబురు పంపుతారు. శంకరప్ప, ఏనుగు మీద కాని రాడట అని తిరుగు కబురు పంపుతాడు.

ఆ సంకేతం పాఠకులకు అర్ధం కాదు.

రాజు ఆటలో గుర్రాన్ని నడిపిస్తానని కబురు చేస్తారు. 

దానికి సమాధానంగా శంకరప్ప ఏనుగుతో అడ్డంపడతాను మీ ఆట కట్టిస్తాను అని సమాధానం ఇస్తాడు. రాజుతో ఆట ఆడి ఆయన ఆటను కట్టిస్తాడు.

మహరాజు ఓటమి ఒప్పుకుని పెద్దాపుర రాజ్యం లోఏమి కోరుకున్నా ఇచ్చేస్తానంటాడు. తాను సామాన్య బ్రాహ్మణుడిని కాబట్టి గ్రాసానికి ఏర్పాటు చేయమని అడిగి అది కూడా లెక్క చెప్తాడు శంకరప్ప.

చదరంగపు బల్ల మీద మొదటిగడిలో ఒక వడ్లగింజ రెండవ దానిలో రెట్టింపు మూడవదానిలో రెండవ దానికి రెట్టింపు పెట్టుకుంటూ అరవై నాలుగు గళ్ళల్లో ఎన్ని వడ్లగింజలు వస్తే అన్ని ఇప్పించమని అడుగుతాడు.

దివాన్జీ లెక్కలు కట్టడం మొదలెడతాడు. చివరకు పెద్దాపురం సంస్థానం మొత్తం మీద ముఫై సంవత్సరాల కాలంలో పండే ధాన్యపు ఇచ్చినా శంకరప్ప కోరుకున్న ధాన్యం సరిపోదని తేల్చి చెప్తాడు.

ఇంక చేసేది లేక మహరాజు పెద్దాపురం సంస్థానాన్నే ఇచ్చేస్తున్నా తీసుకోమంటాడు. మన పందెం ప్రకారం మీరు పెద్దాపురం సంస్థానంలో ఉన్నదే ఇస్తామన్నారు కాని సంస్థానం ఇచ్చేస్తానని చెప్పలేదు కదా, అంటాడు శంకరప్ప.

నా బోటి బ్రాహ్మణుడు సంస్థానం ఏం చేసుకుంటాడు? కుటుంబ సహితంగా జీవించడానికి కావల్సినది ఇప్పించమనేటప్పటికి. మహరాజు ఒక అగ్రహారం బహుమానంగా ఇప్పిస్తాడు”

చాలా టూకీగా ఇదీ కథలో కొసమెరుపు. కాని శంకరప్ప రాజుగారి దృష్టిలో పడటానికి పడ్డ ప్రయాస ఇంతా అంతా కాదు. మూల కథ చాలా ఆసక్తిగా ఉంటుంది. వీలైతే చదవండి ఆస్వాదించండి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!