."నేను.....నాది" !

."నేను.....నాది" !

.

"నాది" అనేది ఎప్పుడు మిగులకుండా పోతున్నదో

అప్పుడు "నేను" అనేది కూడా దానంతట అదేపోతున్నది

. "నాది" అనేది ఉన్నప్పుడు "నేను" అనేది ఉంటున్నది. 

"నాది" అనేదానికి "నేను" అనేది ఒకభూమిక లాంటిది.

" జీవితకాలంలో తనకు జరిగినదంతా ఒకమారు తానుకాని 

మరొక వ్యక్తికి జరిగినట్లుగా గుర్తింపగలిగితే తక్షణమే శరీరప్రవర్తనతో సంబంధములేని సాక్షిమాత్రుడైన ఒక "నేను" ను గుర్తింపగలుగుతాడు 

ఇంతకన్నా వేరైన మోక్షమనేది ఏమున్నది? 

.....

భగవాన్ రమణులు ఒక చిన్నమాటతోనే ఒక గొప్ప సత్యము చెబుతారు

. వారి తల్లికి కాగితముపై వ్రాసి ఇచ్చిన మొదటి బోధ ఇది. ---- 

కర్త వారి వారి ప్రారబ్ధ కర్మానుసారము జీవుల నాడించును.

జరుగనిది ఎవరెంత యత్నించినను జరుగదు.

జరుగునది ఎవరెంత అడ్డుపెట్టినను జరుగనే జరుగును 

ఇది సత్యముగనుక మౌనముగ ఉండుటయే ఉత్తమము. ---- 

ఈ విషయమును గుర్తించి దానిని సాధనామార్గముగా తీసుకొని 

తన జీవన విధానంతో అన్వయించుకోగలిగితే తన ప్రమేయము లేకుండా అంతాజరిగిపోతున్నదన్న సత్యము అనుభూతమౌతుంది.

అప్పుడు అన్నిటికీ సాక్షిమాత్రుడైన "నేను" అవుతాడు. 

ముక్త స్థితికి కావలసిన సాధనామార్గమును ఇలా చిన్నమాటలలో భగవాన్ చెప్పినారు. 

--- సద్గురు శివానంద మూర్తిగారి ప్రవచనము నుండి సేకరణ

.

శ్రీ Vvs Sarma గారికికృతజ్ఞలతో

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!