కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !
శ్రీ కృష్ణ స్తోత్రము . శ్లో !! కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ ! నాసాగ్రే నవమౌక్తికం కర తలే వేణుం కరే కంకణమ్ ! సర్వాంగే హరి చందనం చ కలియన్ కంఠే చ ముక్తావళి ! గోప స్త్రీ పరివేష్టి తో వవిజయతే గోపాల చూడామణీః !! తా. లలాటమున కస్తూరీ తిలకము దిద్దుకొన్న వాడును , వక్షః స్థలమున కౌస్తుభ మణిని ధరించిన వాడును , ముక్కునకు బులాకీగా మంచి ముత్యమును ధరించిన వాడును , చేతుల లో వేణువు గలవాడును , చేతులకు కంకణములు ధరించిన వాడును , దేహమందతటను హరిచందనము పూయ బడిన వాడును , కంఠమునందుముత్యాల హారమును ధరించిన వాడును , గోపికా స్త్రీలతో పరివేష్టింపబడి యున్నవాడును , అగు గోపాల చూడామణి అయిన శ్రీ కృష్ణుడు విజయమునుపొందు గాక !!

మీరు విశదీకరించిన విధానం వర్ణించడం మా వశమా...
ReplyDeleteఅద్భుతమైన వివరణ. ఆరాల కుంతలా అంటే ఇంత అర్ధం ఉందని మీ వివరణ ద్వారానే తెలుసు కున్నాను. కృష్ణార్జున యుద్ధం నుంచి స్వీకరించబడింది.
ReplyDeleteచక్కని వివరణ. నేను కూడా ఏదో పక్షికి సంబంధించిన పోలిక, హంసా, నెమలి లాంటి వాటికి సంబంధించిందని అనుకున్నా. curly hair అనే అర్థం కొత్తగా undi
ReplyDeleteవేటూరి గారు సఖియా చెలియ అన్న పాటలో...నీలాంబరాల కుంతల నలుపే అనే మాట రాశారు....
ReplyDelete