ఏగూటిచిలక ఆగూటిపలుకే పలుకు.

ఏగూటిచిలక ఆగూటిపలుకే పలుకు.

వెనక, అబ్బో చాలా ఏళ్ళక్రితం ఒక బోయవాడు అడవిలోకి వెళ్ళి మాట్లాడే రెండు రామచిలకలను పట్టి పంజరంలో పెట్టి తెచ్చాడు. శాస్త్రిగారు ఒక చిలకను కొన్నారు 

ఒక రైతు బామ్మ రెండో చిలకను కొంది 

శాస్త్రిగారి చిలక కొన్నాళ్ళకి అక్కడ సంభాషణలను పలకడం అలవాటు చేసుకొంది. 

రెండో చిలక బామ్మ గారి ఇంట్లో వుందికదా. 

ఆబామ్మగారు మనమరాలి పట్ల మహా కర్కోటకంగా వ్యవహరిస్తుంది. ప్రతిదానికీ ఆంక్షలే. 

ఆ మనుమరాలుకు వళ్ళుమండి నీదుంపతెగ, చావు దొంగపీనుగా, నీకళ్ళు మాడిపోనూ అని తిట్టుకునేది. 

చిలక్కి అవే అలవాటయ్యాయి. 

ఆ మాటలు విని విసిగిపోయిన బామ్మ గారు శాస్త్రిగారి దగ్గరకు వచ్చింది సలహా కోసం. 

రండి, కూర్చోండి, మంచినీళ్ళు కావాలా అని చిలుక ఆహ్వానించడం విని ముచ్చటపడి శాస్త్రిగార్ని తన చిలుకకు కూడా మంచి మాటలు వచ్చేవుపాయం చెప్పమంది. 

కొన్నాళ్ళు నాచిలుకను తీసుకుపోయి నీచిలుక పంజరం పక్కన పెట్టు. ఈ మాటలు దానికి అబ్బుతాయి అని తమచిలుకను ఇచ్చారు 

బామ్మ గారు ఈ చిలుకను పంజరంతో తీసుకుపోయి తన చిలక పక్క తగిలించి ఒక జామకాయ కూడా పంజరంలో పెట్టింది. 

బామ్మగారి చిలుక నీదుంప తెగ, నీకళ్ళు మాడిపోను, చావు దొంగపీనుగా అంది 

వెంటనే శాస్త్రిగారిచిలుక తథాస్తు అంది 

బామ్మ గారికి వళ్ళుమండిపోయి పంజరాలు తెరిచి పొండి పాడు పక్షుల్లారా అని వాటిని వదిలేసింది

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!