ఒకప్పుడు TV చూడటమంటే ఎంతో సరదాగా ఉండేది.

ఒకప్పుడు TV చూడటమంటే ఎంతో సరదాగా ఉండేది. ఆదివారం సాయంత్రం వచ్చే సినిమా కోసం వారం అంతా ఎదురుచూసేవాళ్ళము. సినిమా బాగుందా బాగోలేదా అనే ప్రశ్నే ఉండేది కాదు. వారం మధ్యలో వచ్చే చిత్రలహారి (తెలుగు సినిమా పాటలు) చూడటానికి మాకు పర్మిషన్ ఉండేది. ప్రతీ పాటను ఆస్వాదించేవాళ్ళము. ఆదివారం మహాభారతం వచ్చేటప్పటికి కుంకుడుకాయలతో తలారా స్నానం చేసి, కళ్ళు నలుపుకుంటూ TV ముందు కూర్చునే వాల్లము. మా నాన్న గారు మహాభారతంలో వచ్చే సీన్స్ అన్నే విడమర్చి చెప్పేవాళ్ళు. మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళు మహాభారతం చూడటానికి మా ఇంటికి వచ్ఛేవాళ్ళు.

అతి సర్వత్ర వర్జయేత్ అని, ఇన్ని టీవీ చ్యానెల్స్ వచ్చి మన అనందాన్ని హరించేశాయి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!