నాకు నచ్చిన రెండు పోస్టింగ్స్...

నాకు నచ్చిన రెండు పోస్టింగ్స్...

Lakshmi Vasanta..Jogarao Venkata Rama Sambhara...


ఉత్పల మాల

నేను కిచెన్ను సింకు కడ నిల్చి చివాలున గిన్నె తీసి చే

యానెడునంతలోన అవియన్నియు జాలి గ నోళ్ళు తెర్చి మా

ంలానము శుద్ధి చేయమని మంచిగ యన్నవి కృంగి పోతి నా

మానసమందెదో తళుకు మనది అంట్ల పురాణ కావ్యమై.

(mlaanamu = dirty, used )


సింక్ లో అంట్ల గిన్నెలు ,ఇంకెప్పుడు వస్తావు వసంతా ? అని జాలిగా పిలుస్తున్నాయి , అంతే మనకి ఇలాంటి పిలుపులే ..,పిల్లలు ఇల్లు వదిలాక, అంట్లు ,గిన్నెలు ,తపాళాలు ఇవే చప్పుడు చేస్తున్నాయి ..సహచరుడి కి నాకూ ఒక్కో నిట్టుర్పు కి ఒకో కథ ,అంత దీర్ఘ సంభాషణ అని అర్ధం అయిపోతుంది ..మాటలు లేకుండానే ..మొన్నటి వరకు ,మోడీ ప్రథాని ?? అంటూ సుదీర్ఘం గా టీవి ముచ్చట్లు తో గడిచి పోయింది .

నా ఎఫ్ బి ప్రపంచం లో నేనూ ,అతని గోల్ఫ్ ప్రపంచం లో అతనూ ,ఇద్దరిని కలిపింది ..ఆకలి ..అవతరణి ఒకటి ..పెసరట్టు టిఫినీ అనుకున్నానే ..మరి లేవాలుగా ,కదలాలి గా ,సో ,అందుకే ఫ్రెండ్స్ బై నౌ ..ఈ లోపల ఒక ఏలూరు ప్రయాణం పొస్ట్ ఒకటి పోస్టించాను సమ్యం ఉంటే చూసి, చదివి ,ఒక లైకో ,ఒక కామెంటొ ..వేస్తారు అని ..హోప్ తో వంటిట్లోకి అయిష్టం గా కదిలి వెళుతున్నాను అహోయ్ ..

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!