కృష్ణుని చిలిపి చేష్టలు..

పోతన భాగవతం నుంచి కృష్ణుని చిలిపి చేష్టలు

పడతీ! నీ బిడ్డడు మా

కడవలలో నున్న మంచి కాగిన పాలా

పడుచులకు బోసి చిక్కిన

కడవల బో నడిచె నాజ్ఞ గలదో లేదో?

నీ పాపడు మా గృహముల

నాపోవగ బాలు ద్రావ నగ పడకున్నన్

గోపించి పిన్న పడచుల

వాపోవగ జిమ్ము కొనుచు వచ్చెం దల్లీ

వారిల్లు సొచ్చి కడవల

దోరంబు నెయ్యి ద్రావి తుదినా కడవల్

వేరింట నీ సుతుండిడ

వారికి వీరికిని దొడ్డ వాదయ్యె సతీ!

ఓయమ్మ ! నీ కుమారుడు

మా యిండ్లను బాలు బెరుగు మననీ డమ్మా

పోయెద మెక్కడి కైనను

మాయన్నల సురభులాన మంజుల వాణీ!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!