ఉత్పలమాల

రోజులు గడిచేయి పెద్దవాణ్ణయ్యేను పెళ్ళాం పిల్లలూ వచ్చేరు, విదేశవాసం . రోజులు గడిచిపోతునాయి. 

చిన్నప్పట్నించీ ఉన్న కవిత్వం సరదా ఒక్కసారిగా ఎక్కువయింది. ఏవేవో పద్యాలు రాస్తునాను. కానీ ఈ దేశంలో నా పద్యాలు ఎవరికి వినిపించను. ఎవరికీ వినిపించకపోతే మనసు ఉండబట్టదు.సరే ఎవర్నో పట్టుకుని నా పద్యం వినండీ అని బతిమాలుకోవడం ఎందుకూ, ఇంటావిడ ఉందికదా ఆవిడకే వినిపించేద్దాం అనుకున్నాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలండోయ్ మా గుండుగాడికి క్రికెట్ తెలియనట్లే మా ఇంటావిడకి తెలుగు తెలియదు. మాట్లాదుతుంది కానీ వ్రాయడం చదవడం రావు. నార్త్ లో చదువుకుందిలెండి, మా మామగారు మిలట్రీ మనిషి. 

కనుక ముందు ఆవిడకి పద్యమంటే ఏమిటో చెప్పి తరువాత పద్యం చెప్పాలి. 

సరే కానిద్దాం అనుకుని ఉపోద్గాతంగా, ఏమోయ్ ఉత్పలమాల ఎంత సొగసుగా ఉంటుందనుకున్నావ్ అన్నాను 

అంతే ఆవిడ తాడిప్రమాణాన లేచింది నామీద ఇద్దరాడపిల్లల తండ్రివైకూడా ఇంకా పరస్త్రీల సొగసులు చూస్తునావా ఆయ్ అని. ఉత్పలమాలంటే ఆవిడెవరో కాంచనమాల, రత్నమాలా లాంటి స్త్రీ అనుకుంది కాబోలు.

అబ్బే అది కాదు అని సర్ది చెప్పేటప్పటికి తలప్రాణం తోకకొచ్చిందంటే నమ్మండీ

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!