ఈ పాదమే కదా ఇలయెల్ల గొలిచినది

ఈ పాదమే కదా ఇలయెల్ల గొలిచినది 

ఈ పాదమే కదా ఇందిరా హస్తముల సితవైనది


ఈ పాదమే కదా ఇందరును మ్రొక్కెడిది 

ఈ పాదమే కదా ఈ గగనగంగ పుట్టినది

ఈ పాదమే కదా యెలమి పెంపొందినది 

ఈ పాదమే కదా ఇన్నిటికిని యెక్కుడైనది



ఈ పాదమే కదా యిభరాజు దలచినది 

ఈ పాదమే కదా యింద్రాదులెల్ల వెదకినది

ఈ పాదమే కదా యీబ్రహ్మ కడిగినది 

ఈ పాదమే కదా యెగసి బ్రహ్మాండమంటినది



ఈ పాదమే కదా ఇహపరము లొసగెడిది 

ఈ పాదమే కదా ఇల నహల్యకు కోరికైనది

ఈ పాదమే కదా యీక్షింప దుర్లభము 

ఈ పాదమే కదా ఈ వేంకటాద్రిపై నిరవైనది


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!