'ఏమే చేపా ఎందుకు ఎండలేదు'

అనగనగాఒక రాజు. రాజుగారికి ఏడుగురు కొడుకులు.ఏడుగురు వేటకి వెళ్లేరు. ఏడు చేపలు

    తెచ్చేరు. అందులో ఒకటి ఎండ లేదు. 'ఏమే చేపా ఎందుకు ఎండలేదు' అంటే 'గడ్డి కుప్ప చాటు

    వచ్చింది' అని  చేప చెప్పింది. 'ఇంక ఏమే గడ్డికుప్పా ఎందుకు చాటు వచేవు,ఏమే అవూ ఏందుకు

    మెయ్యలేదు' యిలాప్రశ్నించుకుంటుచివరికి పాపాయికి చీమ కు ట్టడం దానికి కారణం తన 

    బంగారు పుట్టలో పాపాయి వేలు పెట్టడం అని చెప్పడం జరిగింది.నిజంగా ఈ కథ ఎవరు రాసేరో

    గాని సార్వకాలిక సౌందర్యం సంతరించుకుంది.                     

     ఆ నాటి ఆ సమావేశం లో  ఎవరు రాసేరో తెలియలేదుగాని,ఎందుకు

     సార్వకాలికమైందో  చాలా మంది చాలా విధాలుగా చెప్పేరు.

     అందులో ఒకటి.

     చేప జలచరం.  కథ లో ఉన్న మిగతావన్ని నేలమీదనున్నవే.చీమల ఉనికి మటుకు పుట్టలు.

     ఇందులోప్రశ్నలకు  చీమ తప్ప మిగిలినవన్ని 'తప్పు తమది కాదు, వేరొకరిది' అని తప్పించుకొనే

     సమాధానమే చెప్పేయి.చీమ ఒక్కటే 'నా పుట్టలో వేలెడితే కుట్టనా ' అని నిజం చెప్పింది. ఈ కథ

     అనగనగా రాజు అని మొదలయింది.

     అంటె అది బూర్జువా వ్యవస్థ కు ప్రతీక .ఇంక పుట్టలో ఉన్న చీమలు ఫ్యూడల్ వ్యవస్థకు ప్రతీక. 

    "బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ" అనేది ఆర్యోక్తి.తిరుగుబాటు ధోరణి

     చీమలలో ఉండడం అనాదిగా చూస్తున్నదే.

     దీన్ని బట్టి అట్టడుగున ఉన్న అల్ప జీవులు సంపన్నుల మీద తిరగబడడం యీకథ లో కనిస్తోంది.

     ఇలా ఒకరు ఈకథలో అంతర్లీనంగా ఉన్న బూర్జువా ఫ్యూడల్,తిరుగుబాటు ధోరణి కి అన్వయించి చెప్పేరు.

     ఇంక వేరొక సమన్వయం.....ఈ కథ లో 'ఏమే చేపా ఎందుకు ఎండలేదు?' అనేది మొదటి ప్రశ్న.

     'ఎందుకు' అని ప్రశ్నించుకోవదం అన్నది తాత్విక చింతన.

     'నేనెందుకు పుట్టేను? ఇది ఎందుకు ఉంది?'  ఇలా 'ఎందుకు ఎలా' అనే ప్రశ్నల్లోంచి

     జ్ఞానం,తత్త్వం ఉద్భవిస్తాయి.  కాబట్టి కార్యాకారణ  సంబంధమున్న ఈ కథ సార్వకాలికమైనది.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!