మనిషి మారలేదు, మమత తీరలేదు

మనిషి  మారలేదు, మమత తీరలేదు


గుండమ్మ కధ సినిమాలో మహా నటులు NTR, సావిత్రి పాట  “మనిషి మారలేదు, మమత తీరలేదు” అనే పాట మనం ఎన్నటికీ మర్చిపోలేము. అందులో ఎంత నిజం వుందో.


“వేశము మార్చెను, బాషను మార్చెను, మోసము నేర్చెను, అసలు తానే మారెను 

అయినా మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు.”

సావిత్రి గారి అభినయం అంతా ఆ   కల్లలోనే చూపించేస్తారు. పింగలి నాగేశ్వర రావు గారు ఎంత బాగా చెప్పారు ఆ రోజుల్లోనే.

మనందరం వేశం మార్చాము. జీన్స్, ప్యాంట్స్, స్కర్ట్స్ లోకి మారాం. చీరలు, పంచెలు అటకెక్కించాం. ఎప్పుడైన పండగలకు దింపుటాము లేండి.

భాష మార్చాము. English నేర్చాము. రకరకాల accents మాట్లాడటం. తెలుగు ని టెలుగు చేశాం.

మోసము నేర్చెను. నేర్చామా నేర్చలేదా?!!

అసలు తానే మారేను. yes, మారాము. మన ఆలోచనలు, ఆశలు, ఇస్టాలు, ప్రైయారిటీస్ అన్నీ మారిపోయాయి. ఏసీ, కారు లేకుండా ఒక్క రోజు కూడా ఉండలేము.

అయినా మనిషి మారలేదు, మమత తీరలేదు. అవును మనం మారలేదు, మన మమత తీరలేదు. ఏ దేశం  వెళ్లినా, ఎంత ఎత్తుకు ఎదిగినా… అభిమానం,ఆత్మేయతా, ప్రేమ లేకుండా బతకలేము. మన అనే మమత లేకపోతే మనుగడ సాగించలేము. అందుకే ఈ facebook, twitter etc లకు ఇంత గిరాకి. ఈ facebook వచ్చిన తర్వాత పాత మిత్రులను కలవటం కల నిజం అయినట్లు ఉంది. దశాబ్ధాల క్రితం విడిపోయేన స్కూల్ ఫ్రెండ్ ని కూడా  కలవగలుగుతున్నాం.

నేను ఎప్పుడో, ఎక్కడో ఒక కధ చదివాను. ఎవరు రాసారో, ఎక్కడ చదివానో కూడా గుర్తులేదు. కానీ మనసుకు బాగా అత్తుకుంది. దాని సారాంశం ఇది.

ఒక చిన్న బాబు తన కుటుంబంతో పల్లెటూరు నుంచీ పట్నానికి బదిలీ అవుతాడు. ఆ చిన్న వయసులో స్కూల్ కి వెళ్లీ , సాయంత్రం ఇంటికి రాగానే “హమ్మయ్య  నా ఇంటికి వచ్చేశాను“ అన్న secured feeling.  ఇంటర్మీడియేట్ కి వేరే ఊరిలో ఉన్న కాలేజీ,hostel ల్లో join అవుతాడు. సెలవలకు ఇంటికి వచ్చినప్పుడు “ఇది నా ఉరు” అన్న అదే secured  feeling. డిగ్రీకి పక్క రాష్ట్రములో ఉన్న collegeల్లో join అవుతాడు.  Train లో సెలవులకు వస్తున్నప్పుడు చాలా రాష్ట్రాల మీదుగా ప్రయానిస్తాడు.ఆంధ్రాలోకి ప్రవేశించగానే “ఇది నా బాష, నా రాష్ట్రము” అనుకుంటాడు. ఆ తర్వాత PG చేయ్యటానికి వేరే దేశం వెళ్తాడు. మల్లీ సెలవులకే వస్తున్నప్పుడు flight ఇండియాలో  land అవ్వగానే,  “ఇది నా దేశం, నా ప్రజలు” అనుకుంటాడు. ఉద్యోగరీత్యా space లోకి వెళ్తాడు. తిరిగి వస్తూ space rocket భూమి మీద దిగగానే, “ఇది నా భూమి, నా మనుషులు” అనుకుంటాడు.

మనిషి చుట్టూ గీసుకున్న వృత్త వ్యాసం పెరుగుతుందే కానీ,  మనిషి పొట్టకు కావాల్సిందే తిండే, మనసుకు కావాల్సిందే మమతే.

పిడికిలి మించని హృదయంలో 

కడలిని మించిన ఆశలు దాసెను.

అయినా మనిషి మారలేదు, ఆతని మమత తీరలేదు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!