మోహముద్గరః -భజ గోవిందం.! ( ఆది శంకరాచార్య) శ్లోకం - 14.

మోహముద్గరః -భజ గోవిందం.!

( ఆది శంకరాచార్య)

శ్లోకం - 14.

-

జటిలో ముండీ లుంఛితకేశః 

కాషాయాంబరబహుకృతవేషః|

పశ్యన్నపి చన పశ్యతి మూఢో

ఉదరనిమిత్తం బహుకృతవేషః||

-

శ్లోకం అర్ధం : 

జుట్టును జడలుగా కట్టించుకొనుట, తలను నున్నగా గొరిగించుకొనుట, కాషాయవస్త్రములు ధరించుట, ఇట్లు ఉదరపోషణ నిమిత్తము 

పెక్కు వేషములను వేయుచున్నారే కాని లోక పరిస్థితులన్ని

యు చూచుచున్ననూ జ్ఞానోదయమునకై ఎంత మాత్రము ప్రయత్నించరు.

.

తాత్పర్యము : 

వేష, బాషలు భక్తి, జ్ఞానమునకు కొలమానములు కావు. బోడి తల చేసుకొని, నామములు పెట్టుకొని, కాషాయ వస్త్రములు ధరించిన మాత్రమున అజ్ఞాని జ్ఞాని కాడు. బాహ్య వేషములు మోసమునకే కాని, మోక్షము సాధించుటకు పనికిరావు.

జ్ఞానమునకు చిహ్నములు ఇంద్రియ నిగ్రహము, శాంతము, ప్రేమ, దయ, మనోస్థిరత మొదలగునవి. వల్లె వేసిన వేద మంత్రములు పఠించుచుండి, మనసు భగవంతునిపై లగ్నము కానప్పుడు ఆ పూజలు నిరర్ధకము. పరమార్ధము తెలుసుకొనలేని వ్యక్తి ఏ వేషము వేసినను వ్యర్ధమే. జ్ఞాని మనో వాక్కాయ కర్మలు భగవంతునిపై లగ్నము చేయును.

అట్టి మహోన్నతుడు సహనము, ప్రేమ, దయ వంటి ఉత్తమ గుణ సంపన్నుడై ఉండును. సాటి వారిపై తను అతి కరుణతో ప్రవర్తించును. కోపగించుట, పరులను నిష్కారణముగా దూషించుట, అవమానించుట అనునవి రాక్షస గుణములు. అట్టి అవగుణములకు సత్పురుషులు దూరముగా ఉందురు. అప్పుడు వారిని దైవాంశ సంభూతులుగా మనము గౌరవించెదము.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!