-సౌందర్య లహరి! (శ్రీ శంకర భగవత్పాద విరచితము) శ్లోకము (36)

శుభం -సౌందర్య లహరి!

(శ్రీ శంకర భగవత్పాద విరచితము)

శ్లోకము (36)

-

తవాజ్ఞా చక్రస్థం తపన శశికోటి ద్యుతిధరమ్

పరం శంభుం వందే పరిమిళిత పార్శ్వంపరచితా !

యమారాధ్య న్భక్త్యా రవి శశి శుచీనామవిషయే

నిరాలోకే లోకే నివసతి హి భాలోక భువనే !!

-

అమ్మా! నీ ఆజ్ఞాచక్రంలో విరాజిల్లుతూ కోటిసూర్య

చంద్రుల తేజంతో భాసిల్లే పరమశివ మూర్తిని 

ధ్యానిస్తున్నాను. ఆరాధించేవారు సూర్యచంద్రాగ్నుల

ప్రకాశానికి అతీతమైన లోకంలో నివశిస్తారు. 

ఆపరమశివదేవుడు సూర్య చంద్రాగ్ని ప్రకాశాలను

అధిగమించిన మహత్తర తేజంతో భాసిల్లుతుంటాడు.

అక్కడ విఘ్నబాధలేవీ వుండవు.

ఎవరిని భక్తితో ఆరాధించడంవలన _ సూర్యచంద్రాగ్ను

లకు అతీతమైనది, చూడబోతే ఏమీ లేనిది , చూడ

టానికి యితర జనరహితమైనదీ అయి ప్రకాశించే

సహస్రార చక్రంలోని జీవుడు అట్టి పరాత్పరునికీ

సూర్యచంద్రుల్లాగా ప్రకాశించే నీ ఆజ్ఞాచక్రంలో 

(పరాకారజ్ఞానంతో) యిరు పార్శ్వాలనూ ఆక్రమించి

వున్న ఆ పరాత్పరునకు నమస్కరిస్తున్నాను.

-

ఓం శ్రీమహారాజ్ఞ్యైనమః

ఓం చిదగ్నికుండసంభూతాయైనమః

ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యైనమః

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!