అవకాయి పాట -అద్భుతః !

అవకాయి పాట -అద్భుతః !-

అవకాయి -అధరో అధరః !!

ఆవకాయ మన అందరిదీ 

 గోంగూర పచ్చడి మనదేలే 

 ఎందుకు పిజ్జాలెందుకు బర్గర్లెందుకు

 పాస్తాలు ఇంకెందుకులే ఇడ్డెన్లలోకి కొబ్బరి చట్నీ 

 పెసరట్టులోకి అల్లమురా 

 దిబ్బరొట్టెకి తేనె పానకం 

 దొరకకపోతే బెల్లమురా

 వేడి పాయసం ఎప్పటికప్పుడె 

 పులిహోరెప్పుడు మర్నాడే 

 మిర్చీ బజ్జీ నోరు కాలవలె 

 ఆవడ పెరుగున తేలవలె గుత్తివంకాయ కూర కలుపుకొని 

 పాతిక ముద్దలు పీకుమురా 

 గుమ్మడికాయ పులుసుందంటే 

 ఆకులు సైతం నాకునురా

 పనసకాయనే కొన్న రోజునే 

 పెద్దలు తద్దినమన్నారు 

 పసనపొట్టులో ఆవ పెట్టుకొని 

 తరతరాలుగా తిన్నారు తిండి గలిగితే కండ గలదని 

 గురజాడ వారు అన్నారు

 అప్పదాసు ఆ ముక్క పట్టుకొని 

 ముప్పూటలు తెగ తిన్నారు

 ----తనికెళ్ల భరణి,బాలు, స్వప్న, వీణాపాణి,మిథునం (2012)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!