ఇంద్రజిత్తు వేసే బాణాలు _వానరులుభావించిన తీరు!

ఇంద్రజిత్తు వేసే బాణాలు _వానరులుభావించిన తీరు!

-

పిడుగులొకో కావు పొడతేవు ఘనము 

లుల్కా సహస్రంబులో కావుధరణి

యడలదు కాల సర్పావళు లొకొ కావు 

పాతాళ వివరంబు బయలుపడదు

ఖరమైన ముక్కంటి కంటి మంటలొ కావు 

జగదవసానంబు జాడలేదు

కాలకూటార్చులో కావు మందరగోత్ర 

మానితాంభోరాశి గానబడదు

-

మొదలెరుంగరాదు ముసుకొని పుట్టిన

చొప్పు దెలియరాదు చూడ నెచట

నని కపీంద్రు లిట్టు లాజి దల్లడ మంది

రింద్రజిత్తు తూపు లేపు మాప

(భాస్కరరామాయాణము - యుద్ధ. 1268)

పద్యం చూడటాని చాల బాగుందికదా

లోతు పాతులలోకెళితే విషయం అర్థమౌతుంది

చూడండి-

ఇవి పిడుగులా, కావు, మబ్బులు లేవు.

ఉల్కాసహస్రాలా ధరణి కంపిచదు.

కాలసర్పాలా కావు, పాతాళం బయటకు కనబడదు

శివుని కంటి మంటలా, జగత్ప్రళయం కనబడదు

అని వానరులు తల్లడిల్లారట...

-

ఇంతవరకు పద్యం బాగానే ఉంది కానిఇందులో ఔచిత్యం లేదు అనిఆరుద్రగారు తన ప్రాణాలమీదకువచ్చినపుడు ప్రపంచం అంతమైపోతుందని భావిస్తే సహజంగా ఉంటుంది-

ఇందులో జగదవసానకాలం కాదనుకోవడంలోఏమి ఔచిత్యం ఉంది అని అంటారు.

-

Comments

  1. భావాత్మకంతో తెలియని వాటి వివరణ తెలియజేసారు.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!