Sunday, February 11, 2018

బాబాయి గాడి ముద్దు !


-


బాబాయి గాడి ముద్దు !

-

"కిస్-మత్ శాస్త్రి " కి ఒక రోజు ,తన భార్య ని ముద్దు 

పెట్టుకోవాలని పించింది !!

ఇంట్లొ ఎవరూ లేరు అనుకుంటున్న సమయం లో ....టట్ట ఢామ్ !!!! 

హడావుడి గా "పి~~ డు~~ గు", ఎంట్రీ ఇచ్చాడు !!

"హతవిధీ !! వీడొఛాడెమిటీ , ఈ టైమ్లో" అనుకుంటూ,..'' ఒరేయ్! ఫిడుగూ !! ఇలా రారా!!...నువ్వు నాకో సహాయం చెయ్యాలి!!" అన్నాడు "కిస్-మత్ శాస్త్రి ''

"సరే! చెప్పుకో బాబాయ్ !!" అన్నాడు "పిడుగు"

"ఏమీ లేదు!!నువ్వు ఒక పెద్ద సిఐడీ అనుకో!!...పైకి బాల్కనీ లోకి వెళ్లి, ఈ వీధి లో ఎవరు ఎం చేస్తున్నారో, నాకు చెప్పాలి....ఇదిగో,నా సెల్ ఫోను!!" అన్నాడు "కిస్-మత్ శాస్త్రి '' 

"ఓస్! అదేంట పని!!" అని సెల్ ఫోన్ తీసుకుని పై డాబా మీదకి తుర్రు మన్నాడు !!

కామెంటరీ మొదలయ్యింది!!

శర్మ గారు కూరగాయలు తెస్తున్నారు!

అవధానులు గారు, స్కూటర్ స్టార్ట్ చెయ్యడానికి తంటాలు పడుతున్నారు!! 

పిల్లలు కిర్కెట్ ఆడుతున్నారు!!

''''''''''''''''''''''

"మిరపకాయ్" వాళ్ల బాబాయ్ కూడా వాళ్ల పిన్ని ని ముద్దుపెట్టుకుంటున్నాడు!!!!!!!!

"ఎడిశావులె !! అది నీకెలా తెలుసు రా ???" అని ఖంగారుగా అడిగాడు "కిస్-మత్ శాస్త్రి "

"హహహ...వాడు కూడా నా లాగే వాళ్ల బాల్కనీ లో నించుని వున్నాడు,మరి !!!" అన్నాడు "పిడుగు"

(Courtesy- Sri RV Prabhu...గారి జోకులు.)

1 comment: