కృష్ణ పరమాత్ముడు !

కృష్ణ పరమాత్ముడు !

-

శ్రీ రుక్మిణీశ కేశవ

నారద సంగీతలోల /నగధర శౌరీ

ద్వారక నిలయ జనార్ధన

కారుణ్యముతోడ మమ్ము/గావుము కృష్ణా!

-

తాత్పర్యం:


రుక్మిణీదేవికి భర్తవు,పరమేశ్వరుడవు,

నారదుడు చేయు గానమందు ఆసక్తి గలఁవాడవు.

కొండనెత్తిన వాడవు.ద్వారకా పట్టణమందు నివసించువాడవు.

జనులు అను రాక్షసులను చంపిన వాడవు.

అయిన ఓ కృష్ణా!దయతో మమ్ములను రక్షించుము.


.

భారత ఇతి హాసం లో కృష్ణుని ‘’శౌరి ‘అన్నారు 

.వేదాలలో ‘’శూర దేవుని పౌత్రునిగ వర్ణించి ‘’శౌర దేవుడు ‘’అన్నారు 

.ఇతిహాసం లో దేవా అనే పదాన్ని వదిలేశారు .ఇంద్రునికి శౌర దేవత్వం కూడా అవతార సంబంధమే అని మంత్రం చెబుతోంది

ఈ మంత్రం కర్త ‘’పురుహన్మా రుషి ‘’.ఆ మంత్రార్ధం –‘

’శౌరదేవుడైన ఇంద్రా !లేగ దూడలను తీసుకొని వచ్చితల్లి ఆవు దగ్గర పాలను కుడిపించే వాడి లాగా పరలోకం చేరిన కుమారులను మూడు లోకాలలోనూ గాలించి వాళ్ళను తెచ్చి బతికించి ప్రాణ ప్రేరణ చేయి .’’

.భాగవతం దశమ స్కంధం లో చనిపోయిన బ్రాహ్మణ బాలకులను శ్రీకృష్ణుడు బ్రాహ్మణుని కోరిక మేరకు పిలిచి పునర్జీవితులను చేసిన కధ మనకు తెలిసిందే .

ఈ రెండు మంత్రాలకు కర్త అయిన పురుహన్మా రుషియే భాగవతం లో

శ్రీ కృష్ణుని విద్యా చెలికాడు అయిన కుచేలుడనే సుదాముడు .

అతడు ప్రేమతో తెచ్చిసమర్పించిన గుప్పెడు అటుకులు గ్రహించి 

అతనికి సాటి లేని సంపద నిచ్చి ఆదరించాడు బాల్య సఖుడైన కృష్ణుడు .

-

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!