గడిచిపోయిన నా జీవితాన్ని వెనక్కి పిలువరా..!” (మిర్జా గాలిబ్ కవిత)

గడిచిపోయిన నా జీవితాన్ని వెనక్కి పిలువరా..!”

(మిర్జా గాలిబ్ కవిత)

-


“ఖైదే యయాత్ బందే గమ్ అస్లమే దోనో ఏక్ హై

మోత్ సే పహారే ఆద్మీ గమ్ సే సజాత్ పాయే క్యోం”

-


తాత్పర్యం ఏంటంటే-

“జీవిత బంధంలో ఉన్నంత కాలం బాధలు ఉండేవే. మృత్యువు కంటే ముందు మనిషి బాధల నుండి ఎలా తప్పించుకుంటాడు?” అని

ఈ సమయం లో నాకు జగ్జిత్ సింగ్ ఘజల్ ఒకటి గుర్తొస్తుంది. 

-

“వొహ్ కౌన్ హై దునియా మే జిసే గమ్ నహీ హోతా..

కిస్ ఘర్ మే ఖుషీ హోతీ హై మాతం నహి హోతా?”


అర్థం ఏంటంటే

“ప్రపంచం లో బాధలు /దుఖం లేని మనిషి ఎవరు ? 

సంతోషం తప్ప మృత్యువు ఉండని ఇల్లు ఉంటుందా?” అని.


ఈ రెండూ ఒకే సత్యాన్ని తెలియజేస్తున్నాయన్న భావనతో 

ఈ ఘజల్ ని ప్రస్తావించటం జరిగింది.


మీర్జా గాలిబ్ కి కఠినం గా ఉండే కవిత చెప్పటం ఇష్టమట.

అతని సమకాలీనులు 

“అయ్యా..! ,ఈ కవిత మీకే అర్థం కావలె లేదా పైవానికి అర్థం కావలె. మా లాంటి వాళ్లకు అర్థం అయ్యేది కాదు” అని పరిహసించేవాళ్ళట.

-

“జిస్ ఖదర్ లోగోంకో నా తిఖ్..! 

యాద్ హైహై వహీ దీవనె-మత్బూ -ఆ మేరా ”


అంటే ‘ఎంతవరకు నా కవిత లోకుల నాలుకల మీద 

నిలచివున్నదో అదే ముద్రితమైన నా దివాన్ అని అంటారు


“నాతిఖ్ లఖ్నవీ” అనే కవి. 

(దివాన్ అంటే కవితా సంకలనం)

లోకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుని కూర్చుంటాయి. మధురానుభూతులుగా పదే పదే నెమరువేసుకునేలా చేస్తాయి

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!