అధర్వణ భారతం !

అధర్వణ భారతం !

.

(దుష్కర ప్రాస ) ..

.

శా: తృష్ణాతంతు నిబధ్ధ బుధ్దులయి రాధేయాదులం గూడి శ్రీ

కృష్ణున్ గేవల మర్త్యుగాఁ దలచి బంధింపగంగ నుత్సాహ వ

ర్ధిష్ణుండయ్యె సుయోధనుం డకట! ధాత్రీనాధ! యూహింపుమా

యుష్ణీషంబున గట్టవచ్చునె? మదవ్యూఢోగ్ర శుండాగ్రమున్;

.

నన్నయ్యకు సమకాలముననో 

కొద్దికాలము తరువాతనో అధర్వణుఁడను జైనకవి యుండెడివాడట. అతడుగూడ భారతము నాంధ్రీకరిచెనని ప్రవాదము.

ప్రస్తుత పద్యము ఉద్యోగపర్వమునందలి కృష్ణ రాయబార ఘట్టమునకు జెందినది.

శ్రేయోదాయకములైన మాటలుచెప్పి కురు పాండవులకు సంధిచేయ 

వచ్చిన కృష్ణుని కర్ణాది మిత్రజన పరివారముతో బంధింప 

సుయోధనుడు ప్రయత్నించుట యెట్లున్నది? 

మద గజమును తలపాగ గుడ్డతో బంధింపఁ జూచినట్లున్నదని కవియభిప్రాయము.

ఈపద్యంలో కవి చక్కని కవితా శిల్పమును ప్రదర్శించినాడు. 

సుయోధనుడు " తృష్ణాతంతు నిబధ్ధ బుధ్ధియైనాడట"-

అంటే ఆశాపాశముచే బంధింపఁబడినాడట. 

అతవి యాశకూడ గట్టిదిగాదు. కేవలదారముతో సమానమైనదట. 

దారము పుటుక్కున తెగిపోవును. దానికి గట్టితనమేది? 

ఇతని యాశకూడతీరనిదే! ఇంతకూ యేమిటాయాశ?

కృష్ణుని బంధించినట్టు. పరమాత్మ పట్టుబడువాడా?

తాను బంధింపఁడి ,ఇతరులను బంధింప జూచుట యెంత హాస్యాస్పదము? చివరకు అట్లేయైనది. శ్రీకృష్ణుని విశ్వరూప సందర్శనంతో 

అతనియాశ లడియాస లైనవి.

ఏవం విధములైన కథావిషయములను చెప్పనక్కర లేనిరీతిగా 

1 తృషష్ణాతంతు నిబధ్ధబుధ్ధులయి అనుసమాసమును 

2 ఉష్ణీషంబున గట్టవచ్చునె మదవ్యూఢోగ్రశుండాగ్రమున్ ;-

అనేరెండు సమాసాలను ప్రయోగించాడు. 

పండితులకు గూడ కఠినమైన ష్ణ ప్రాసను (దుష్కర ప్రాస ) వాడి పాఠకుల కాశ్చర్యమును గల్పించెను.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!