ఘనాపాఠి అని ఎవరిని అంటారు ?

ఘనాపాఠి అని ఎవరిని అంటారు ? దేనిలో ప్రావిణ్యం ఉన్నవారికి 

ఈ బిరుదు లభిస్తుంది ?

.

కృష్ణ యజుర్వేదంలో వరుసగా...సంహిత మంత్రాలు

(42 పన్నాలు లేక ప్రశ్నలు ), అరణ్యకం ( బ్రహ్మ విచారం ) (12 ప్రశ్నలు ), బ్రాహ్మణం ( మంత్రం యొక్క తంతు భాగం )(28 ప్రశ్నలు ) ... 

ఈ మొత్తం 82 ప్రశ్నలను "ఆశీతిద్వయం " అందురు. 

మొత్తం 82 ప్రశ్నలను ఆవర్తనం చేసిన పిదప ... సంహిత మంత్రాలకు 

(42 ప్రశ్నలకు ) పదపాటం , క్రమ , జట , ఘనాపాఠం చేసి " ఘనాపాఠి " అవుతారు.

ఘనం అంటే అదొక వేద పఠనములో ఉచ్చారణ ప్రక్రియ.

ఉదాహరణకు 12-21-123-321-123-23-32 ఇలా వరుసలో చదువుతారు. (ఇక్కడ అంకెలు శబ్దాలు) ... 

ఉదా : గణాణాం / త్వా / గణపతిగుం ( Contd )....అనే దానిలో ఒక్కో పదాన్ని 1,2,3 లాగా తీసికొని పైన చెప్పిన 12-21-123-321-123-23-32 వరుస క్రమములో గబగబా చదవగలగాలి . 

ఇలా మొత్తం శ్లోకాన్ని ఈ ఘనం క్రమంలో చదివి మీరు కూడా చిన్నపాటి ఘనాపాఠి అయిపోయి అందరి మెప్పును పొందవచ్చు .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!