''కేర్.. కేర్ ''మన తెలుగు కవులు.!

''కేర్.. కేర్ ''మన తెలుగు కవులు.!

వారి వారి సిగ్నేచర్ స్టైల్ లో వీరేమని ఉంటారో బుచ్చిబాబు గారు 

ఊహించిన చమత్కార ''కేర్.. కేర్ '' లు చూద్దాం...

.

విశ్వనాధవారు( మంత్రసాని తో)

'' ఓహో కిన్నెరసాని''( జననం శీతాకాలం లో అయితే) 

హా హూ హూ

.

మునిమాణిక్యం;; మనం ఇంకా ఇరవై య్యేళ్ళ దాకా

చీర కొనక్కర్లేదు కాంతానికి

.

చలం ;;--( మంత్రసానితో) ''పో '''' లేచి పో ''

.

నండూరి సుబ్బారావు;;- ఎనక జన్మములో ఎవరమో

.

వున్నవ లక్ష్మీ నారాయణ ;;- (చుట్టూ చూసి )మాల పల్లి ఎక్కడ?

.

కందుకూరి వారు;;- ఒక్క విధవనీ ఉండనివ్వను స్వర్గం లో

.

గుర జాడ ;;-'' డామిట్'' కధ అడ్డం తిరిగింది

.

శ్రీ శ్రీ ;;- ఉగ్గుగిన్నె పక్కన పెట్టి ఓ పెగ్గందుకో (మంత్రసానితో)

.

దేవుల పల్లి వారు ;;- వెక్కి వెక్కి రోదింతును. విసువు లేక ఏడవ లేకఎడ్వలేక

ఏడ్చు చుంటి

.

ఆత్రేయ ;;- పుట్టినప్పుడు బట్ట కట్టలేదు

.

వేటూరి ;;- ఆరేసుకోబోయి పారేసుకున్నాను

.

తా పీ ధర్మా రావు ;;- గోడలవైపు చూస్తూ (బూతు బొమ్మలు లేవు కదా!

.

నార్ల ;;- ఈరోజు ఎడిటోరియల్ దేనిమీద రాయ మంటావూ!?


x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!