Dr.M.Balamuralikrishna (Ramachandrulu. Bhadrachala Ramadasa)

రామదాసు.!

-

రామచంద్రులు నాపై చలము చేసినారు

సీతమ్మా చెప్పవమ్మా

కటకటా వినడేమి జేయుదు

కఠిన చిత్తుని మనసు కరుగదు

కర్మములు ఎటులుందునో గదా

ధర్మమే నీకుండునమ్మ

దినదినము మీ చుట్టు దీనతతో తిరుగ

దిక్కెవ్వరిక ఓ యమ్మ

దీనపోషకుడనుచు వేడితి

దిక్కులన్నియు ప్రకటమాయెను

ఒక్కమాటైనను వినడు

ఎక్కువేమని తలతునమ్మ

దశరథాత్మజుడెంతో దయశాలి యనుకొంటి

ధర్మహీనుడే ఓ యమ్మ

దాసజనులకు దాత అతడట

వాసిగ భద్రగిరీశుడట

రామదాసుని ఏల రాడట

రవికులాంబుధి సోముడితడట

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!