కృష్ణ భక్తప్రియా !.

కృష్ణ శతకం .!.....(31/5/16.)

.

(కృష్ణ శతకం లోనిదీ పద్యం . కృష్ణ శతకం తిక్కన రాసిన దని

కొందరి అభిప్రాయం . ఈ శతకం ఇప్పుడు లభించడం లేదు .)

.

"అరయన్ శంతను పుత్రుపై విదురుపై నక్రూరుపై గుబ్జపై

నరుపై ద్రౌపదిపై గుచేలునిపయిన్ నందవ్రజ శ్రేణిపై

బరగం గల్గు భవత్కృపారసము నాపై గొంత రానిమ్ము నీ

చరణాబ్జమ్ములె నమ్మినాడ జగదీశా ! కృష్ణ భక్తప్రియా !.

.

భక్తులు ఎంతమందో ! గాంగేయుడు , విదురుడు , అకౄరుడు , కుబ్జ , ద్రౌపది , కుచేలుడు , నందుని పరివారమంతా ,చెప్పుకుంటూ పోతే ఎంతమందో .

జగన్నాటక సూత్రధారి దయకు పాత్రులైనవారు లెక్కకు మించి ఉన్నారు

. .

భక్తుడు భగవంతునికి కొందరు భక్తుల పేర్లను జ్ఞాపకం చేసి ,

పరమాత్మా నేనుకూడా నీ శ్రీచరణాలను ఆశ్రయించిన వాడినే . 

ఇతర భక్తులమీద చూపిన కృప నా మీద కూడా కొంతైనా ప్రసరింపజేయవా ! 

అని దీనంగా అర్థిస్తున్నాడు .

.

నేను నీ భక్తుణ్ణేనని చెబుతూ , కృష్ణా భక్త ప్రియా అని సంబోధించి

ఆ స్వామి దయకు డవుతున్నాడు . ” శరణం నీ దివ్య చరణం ” అని

భక్తుడు ప్రార్థిస్తే భగవంతుడు కరిగిపోడా

(కేశవన్ గారి చిత్రం...శ్రీకృష్ణ..కుబ్జా.)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!