నూతన వసంతం!

నూతన వసంతం

(శిష్‌ట్లా ఉమా విజయ మహేశ్వర వినాయక్‌...చిత్రం వడ్డాది.)

.

వచ్చె బహుధాన్య సంవత్సరాది! వచ్చె వచ్చె నూతన వసంతాకాలము! మిత్రమా రావోయి!

వసంతం వాసంత మోయీ! వచ్చినది వాసంత మోయీ! మిత్రమా రావోయి!

కలిసి సావాసముగా మెలిసి ఎకచక పరాచికాలతో పోదాము రావోయి!

కోయిలలు కూయగా గోరంకి చిలకకై కులుకుతూ పలుకగా విందాము రావోయి!

చిట్టి మట్టెలపైన కడియాలతో అడుగులు వేయు చడుగుడుల మనసులు గల వాసంతిక లరుగో! వచ్చింది వాసంత మోయీ! ఏదైనా గున్న మామిడికై వెళ్ళి పోదామోయి!

మంచుపూవుల బోలు తుమ్మి పూవులను దసరాలోనే గాదు వసంతా కాలమున గూడ ఏరుదాము రావోయి!

రత్నపూ రేకులను నమలుతూ పొగడ కొమ్మల క్రింద ఉందామా?

మీ ఇంటికి మా ఇంటికి దూరముతో తంగేడుచెట్లకు దారముతో వసంతాకాలమున ఎక్కడకు పోయినా ప్రేయసీ! ఏ వూరు పోయినా ఏటికి అవతల ఉన్నట్లేగద!

ఆయేరు ఏరువాకయే ఐన, నీ ప్రణయసొన యేరువాకయే యైన ఇవతలేమి అవతలేమి!

ప్రణయసొన యేరువాకతో ప్రాహ్లాద కవితా ఫణితితో వసంతం వచ్చెనోయీ, రావోయి నీవు నీవు!

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!