తల్లి ప్రేమ.!

తల్లి ప్రేమ.!

.

కస్తూరి రంగరంగా - నాయన్న కావేటి రంగరంగా

శ్రీరంగరంగరంగా - నినుబాసి ఎట్లునే మరచుందురా

కస్తూరి రంగరంగా - నాయన్న కావేటి రంగరంగా.

.

శ్రీరంగరంగరంగా - నినుబాసి ఎట్లునే మరచుందురా.

కంసుణ్ణి సం హరింప - సద్గురుఢు అవాతారమెత్తినపుఢు. 

దేవకి గర్భమునను - కృష్ణావతారమై జన్మించెనూ. 

ఏడు రాతృలు వింతగా - తాబూని ఏకరాత్రిగ చెసెను.

ఆదివారము పూటనూ - అష్టమి దినమందు జన్మించెను.

తలతోటి జననమైతే - తనకు బహుమోసంబు వచ్చుననుచు. 

ఎదురు కాళ్ళను బుట్టెనూ - ఏడుగురు దాదులను తాచంపెనూ.

నెత్తుటిలో వుండినపుడు - ఆబాల కావుకావున ఏడ్చుచూ.

నన్నేల ఎత్తుకొనవే - నాతల్లి దేవకీ వందనంబు. 

ఒళ్ళెళ్ళ హీనంబుతో - ఈరీతి నున్నవు కన్నతండ్రీ. 

నిన్నెట్టు లెత్తుకుందూ - నీవొక్క నిముసంబు తాళుమంచు. 

గంగనూ ప్రార్ధించెనూ - జలనిధుల గంగ తానుప్పొంగెనూ. 

గంగ నీటిలోనప్పుడూ - దేవకీ జలకంబు లాడెతానూ. 

ఇకనైన ఎత్తుకొనవే - నాతల్లి దేవకే వ0దన0బు. 

కానిబాలునివోలెను - నన్నిట్ట్లు ఎడబాసి వు0డతగునా. 

నీ పుణ్యమాయె కొడకా - ఇ0కొక్క నిమిష0బు తాళుమనుచూ. 

కామధేనువు నప్పుడూ - దేవకీ మదిలోన తలచగానూ. పాలవర్షము కురిసెను - అప్పుడా బాలపై జల్లగానె. తడి వస్త్రమును వీడియూ 

దేవకీ పొడి వస్త్రమును గట్టెనూ. పొత్తులమీదనపుడూ బాలు0డు

చక్కగా పవళి0చెనూ. తన రె0డు హస్తములతో దేవకీ బాలుణ్ణి ఎత్తుకొనెనూ. అడ్డలపై వేసుక ఆబాలు చక్కదనమును జూచెనూ.

వసుదేవ పుత్రుదమ్మ ఏబిడ్డ వైకు0ఠవాసుడమ్మ.

సిరమున చి0తామణి నాత0డ్రినాలుకున నక్షత్రమూ.

ప0డ్లను పరషువేది భుజమ0దు శ0ఖు చక్రము ...

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!